దారికాచి దారుణ హత్య

27 Nov, 2019 08:14 IST|Sakshi
దుర్ఘటన జరిగిన ప్రాంతంలో పోలీసులు, హత్యకు గురైన కిశోర్‌ గజ్వింకర్‌

సాక్షి, డబీర్‌పురా: వ్యాపార లావాదేవీల కారణంగా ఓ వ్యాపారిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన డబీర్‌పురా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం రాత్రి జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. హయత్‌నగర్‌ అబ్దుల్లాపూర్‌మెట్‌ ప్రాంతానికి చెందిన కిశోర్‌ గజ్వింకర్‌(34) కొత్తపేట ఫ్రూట్స్‌ మార్కెట్‌లో పండ్ల వ్యాపారం చేస్తుంటాడు. మంగళవారం రాత్రి తన ద్విచక్ర వాహనంపై దారుషిఫా అజాఖానా జహేరా సమీపంలోని కుడా ప్రభుత్వ కార్యాలయం వైపు గల్లీలో నుంచి వెళుతుండగా.. గుర్తు తెలియని వ్యక్తులు కిశోర్‌ను అడ్డుకొని కత్తులతో దాడి దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటనలో కిశోర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు.

సమాచారం అందుకున్న మీర్‌చౌక్, డబీర్‌పురా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలానికి నగర ట్రాఫిక్‌–2 డీసీపీ కె.బాబూరావు, నగర టాస్క్‌ఫోర్స్‌ అదనపు డీసీపీ చక్రవర్తి, మీర్‌చౌక్‌ ఏసీపీ డి.ఆనంద్, ఇన్‌స్పెక్టర్లు సత్యనారాయణ, ఆనంద్‌ కిశోర్‌ చేసుకొని వివరాలను సేకరించారు. ఆర్థిక లావాదేవీల కారణంగా హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నట్టు చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కరోనా భయంతో వ్యక్తి ఆత్మహత్య

మద్యం దొరక్కపోవడంతో వ్యక్తి ఆత్మహత్య!

కరోనా పాజిటివ్‌: ఆ జర్నలిస్టుపై ఎఫ్‌ఐఆర్‌

ఆత్మహత్య: ఏం కష్టం వచ్చిందో..? 

కరోనాపై ఇన్ఫోసిస్ ఉద్యోగి పైత్యం...అరెస్టు

సినిమా

బుల్లితెర కార్మికులకు యాంకర్‌ ప్రదీప్‌ చేయూత

కిచెన్‌ స్వాధీనం చేసుకున్న రాజేంద్రప్రసాద్‌

ఏఆర్‌ రెహమాన్‌ కచ్చేరీలు రద్దు 

కరోనా విరాళం

17 ఏళ్లు... 20 సినిమాలు

‘జుమాంజి’ నటికి కరోనా