అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

18 May, 2018 10:56 IST|Sakshi
రోడ్డుపై పడిఉన్న మృతదేహం

ఖాజీపేట జాతీయరహదారిపై మృతదేహం

హత్యా.. రోడ్డు ప్రమాదమా

కేసు దర్యాప్తు చేస్తున్నపోలీసులు

ఖాజీపేట : ఖాజీపేట మండలం అగ్రహారం  సమీపంలోని జాతీయ రహదారిపై బుధవారం రాత్రి పోరుమామిళ్లకు చెందిన షేక్‌ సర్దార్‌ (29) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.  పోలీసులకు సమాచారం రావడంతో అక్కడకు చేరుని పరిశీలించారు. జరిగిన సంఘటన రోడ్డు ప్రమాదమా లేక హత్యచేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారా అన్న అనుమానాలు పోలీసులు వ్యక్తపరుస్తున్నారు. వివరాల్లోకి వెళితే

షేక్‌.సర్దార్‌ ది ప్రకాశం జిల్లా కొమరోలు. ఇతను పోరుమామిళ్లకు చెందిన షేక్‌ మహబూబ్‌నిషాను ఏడేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వివాహమైన ఏడాది తర్వాత నుంచి  పోరుమామిళ్లలో నివాసం ఉంటున్నాడు. డ్రైవర్‌గా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మృతునికి  ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నాడు. 16వతేదీ రాత్రి అగ్రహారం సమీపంలోని జాతీయ రహదారిపై మృతదేహం ఉందని తెలియడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని మైదుకూరు డీఎస్పీ శ్రీనివాసులు, ఎస్‌ఐ హాజీవలి  పరిశీలించారు. అనంతరం కడప రిమ్స్‌కు తరలించారు. అతని జేబులోని డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఆధారంగా అతని పేరు సర్దార్‌గా నిర్ధారించారు. స్వగ్రామం కొమరోలుగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

అయితే అతని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. 16వ తేదీ ఉదయం సర్దార్‌ కారు తీసుకుని వస్తానని చెప్పి కడపకు వెళ్లాడు. కడపకు చేరున్న తరువాత ఫోన్‌ చేశాడు. తిరిగా సాయంత్రం బయలు దేరుతానని చెప్పాడు. అయితే అర్థరాత్రి భర్త చనిపోయినట్లు సమాచారం రావడంతో ఇక్కడకి వచ్చామని చెబుతోంది.

మృతిపై అనేక అనుమానాలు
సర్దార్‌ మృతి పై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోరుమామిళ్లకు చెందిన వ్యక్తి ఖాజీపేట జాతీయ రహదారిపై ఎలా మృతి చెందాడన్న విషయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పోరుమామిళ్లకు వెళ్లాల్సిన వ్యక్తి ఇక్కడికి ఎలా వచ్చాడు. కారును తీసుకు వస్తానని భార్యతో చెప్పిన వాడు కారులో రావాలి.. లేదా ఇంటికి వెళ్లాలంటే ఏదైనా వాహనంలో కానీ బస్సులో కానీ వెళ్లాలి. కానీ వాహనంలో వచ్చినట్లు కనిపించడంలేదు.. అతను ఖాజీపేట జాతీయ రహదారిపై ఎందుకు ఉన్నాడు.. ప్రమాదం జరిగిన సమయంలో శరీరంపై చొక్కాలేదు. చెప్పులు దూరంగా పడి ఉన్నాయి. మృతుడి తలపై నుంచి వాహనం వెళ్లడంతో తల పూర్తిగా ఛిద్రమైంది. ఎవ్వరైనా అతనిపై దాడిచేసి ఇక్కడ పడేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నడిరోడ్డుపై హత్య చేసి తలతో పోలీస్‌ స్టేషన్‌కి..

ముఖ్యమంత్రిని కిడ్నాప్‌ చేస్తా!

తల్లి వద్దనుకుంది.. మూగజీవులు కాపాడాయి

సవతి తండ్రిని కాల్చి చంపిన కొడుకు..

నేరుగా షిరిడి సాయిబాబాతో మాట్లాడుతానంటూ..

సెల్‌ఫోన్‌ కొనివ్వలేదని..

‘జబర్దస్త్‌’ ఆర్టిస్ట్‌ వినోదినిపై దాడి.. గాయాలు

కొడుక్కి ఫోన్ ఇవ్వడంతో బండారం బైటపడింది!

కనుగుడ్లు పీకి, మొహంచెక్కి బాలిక దారుణ హత్య

రూమ్‌మేటే దొంగ.. !

ఉసురు తీస్తున్న విద్యుదాఘాతం

తల్లి, కుమార్తె అదృశ్యం

నలుగురా..? ఇంకొకళ్ళను ఎక్కించుకోపోయారా?’

బ్లూవేల్‌ భూతం : చిరుతకు స్వాతంత్ర్యం..!

పద్మావతి డిగ్రీ కళాశాలలో చోరీ కలకలం

చిన్నారి కిడ్నాప్‌.. రూ.60లక్షల డిమాండ్‌

ఫేస్‌బుక్‌ పరిచయం.. పెళ్లి చేసుకుంటానని..

ఏసీబీ విచారణ : తల తిరుగుతోందంటూ సాకులు

ప్రేమ వివాహం.. భర్త హత్య భార్య అరెస్టు

దారుణం: బాలిక పాశవిక హత్య

ఐఎంఏ జ్యువెల్స్‌ అధినేత అరెస్టు 

బిహార్‌లో మూకదాడి.. ముగ్గురి మృతి 

ఛత్తీస్‌గఢ్‌లో ఓయూ విద్యార్థి అరెస్ట్‌ !

క్లాస్‌ లీడర్‌ కాలేదని..

అనుమానంతో భార్యను.. అడ్డువచ్చిన అత్తను..

వైరల్‌: ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్‌

విషాదం: ఎనిమిది మంది చిన్నారుల మృతి

విడాకుల కోసం.. భార్యను స్నేహితుడితో..

వైఎస్‌ జగన్‌పై దాడి కేసులో హైకోర్టు సంచలన నిర్ణయం

అపూర్వ శుక్లాపై చార్జీ షీట్‌ దాఖలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అదే నిజమైన విజయం

ఫారిన్‌ గ్యాంగ్‌స్టర్‌

బేడీలు వేస్తాం!

మా ఊరిని చూపించాలనుంది

మళ్లీ నిన్నే పెళ్లాడతా

మంచు వారింట్లో సీమంతం సందడి