బిహార్‌లో మైనర్‌ బాలికపై దారుణం

30 Apr, 2018 12:47 IST|Sakshi
బాలికపై దాడికి పాల్పడుతున్న యువకులు

పాట్నా, బిహార్‌ : జెహానాబాద్‌లో పట్టపగలు దారుణం చోటు చేసుకుంది. నడిరోడ్డుపై మైనర్‌ బాలికపై ఆరుగురు యువకులు దాడికి పాల్పడ్డారు. ఆమె బట్టలూడదీసి పరుగెత్తించారు. ఇందుకు సంబంధించిన వీడియో వాట్సాప్‌లో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు నలుగురు యువకులను అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.

కాగా, సోషల్‌మీడియాలో షేర్‌ అవుతోన్న ఈ వీడియోపై నెటిజన్లు భగ్గమన్నారు. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి నయ్యర్‌ హస్నైన్‌ ఈ ఘటనపై విచారణ జరిపేందుకు ప్రత్యేక సిట్‌ను ఏర్పాటు చేశారు. యువకులు వినియోగించిన బైక్‌ ద్వారా సమాచారాన్ని రాబట్టేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.

ఇప్పటికే వీడియోను చిత్రీకరించిన ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పరారీలోని ఇద్దరు యువకులను పట్టుకునేందుకు జెహానాబాద్‌లో ప్రతి ఇంటిలో గాలిస్తున్నారు. ఈ కేసులో నిందితులపై పోక్సో చట్టం కింద ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారు.

మరిన్ని వార్తలు