Sakshi News home page

ఆస్తి వివాదం..తల్లీకూతుళ్ల ఆత్మహత్య

Published Fri, Dec 22 2017 11:56 AM

mother and daughter suicide with property dispute - Sakshi

సిరిసిల్లక్రైం:  ఆస్తి వివాదం ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. ఆస్తి పంపకాల కోసం జరిగిన పంచాయితీలు.. అవమానాలతో తల్లీకూతుళ్లు గుడ్ల విజయ(60), జ్యోతి(30) గురువారం ఆత్మహత్యకు పాల్ప డ్డారు. రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన విజయకు, గుడ్ల విశ్వనాథంతో వివాహమైంది. వీరికి ఇద్ద రు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. అనంతరం వి శ్వనాథం రెండోపెళ్లి చేసుకుని వేరుగా ఉంటున్నాడు. విజయ పెద్దకూతురు హైదరాబాద్‌లో ఉంటుండగా, చిన్నకూతురు జ్యోతికి విడాకులవడంతో ఇంటి వద్దే ఉంటుంది. చిన్నకొడుకు నరేందర్, భార్య వీరితోనే ఉంటున్నారు. పెద్దకొడుకు సిరిసిల్లలోనే వేరే ప్రాంతంలో నివసిస్తున్నాడు. ప్రస్తుతం విజయ ఉంటున్న ఇల్లు, మూడు జోడీల సాంచలు, కండెలు చుట్టే మిషన్‌ వివాదంగా మారాయి. 

ఆస్తిపంపకాలలో వివాదం
ఇంటిస్థలంతోపాటు మూడు జోడీల సాంచలు పంచుకునే క్రమంలో కుటుంబసభ్యుల మధ్య పంచాయితీలు జరిగాయి. ఈక్రమంలోనే రెండు రోజుల క్రితం విజయ పెద్దకొడుకు ఆమెపై చేయిచేసుకున్నాడు. ఈ అవమానంతోనే ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. చనిపోవడానికి రెండు రోజుల ముందే సూసైడ్‌నోట్‌ రాసిపెట్టుకున్నా రు. తమ చావుకు భర్త విశ్వనాథంతోపాటు పట్టణానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకులే కారణమని అందులో పేర్కొన్నారు. పెద్దకొడుకు అశోక్‌ అత్తవారిని వదలొద్దని కోరారు. సిరిసిల్ల సీఐ శ్రీనివాస్‌రావు సంఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.   

కొడుకుపై కేసు
ఆస్తిని పంచాలంటూ కన్నతల్లి, తోడబుట్టిన చెల్లి చావుకు కారణమైన వ్యక్తిపై సిరిసిల్ల పోలీçసులు కేసు నమోదు చేశారు. సీఐ తెలిపిన వివరాలు. గుడ్ల విజయ(60), జ్యోతి(30)పై రెండు రోజు ల క్రితం గుడ్ల అశోక్‌ దుర్భాశలాడుతూ చేయిచేసుకున్నాడు. మనస్తాపానికి గురైన తల్లీకూతుళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. విజయ చిన్నకొడుకు నరేందర్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

Advertisement

What’s your opinion

Advertisement