ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వాహకుడి అరెస్టు

13 May, 2019 04:05 IST|Sakshi
నిందితుడు అభీర్‌ చంద

పశ్చిమ బెంగాల్‌లో అదుపులోకి తీసుకున్న గుంటూరు పోలీసులు

గుంటూరు: ఆన్‌లైన్‌లో క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న వ్యక్తిని గుంటూరు రూరల్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం గుంటూరులోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో  ఎస్పీ ఎస్‌వి రాజశేఖరబాబు వివరాలు వెల్లడించారు. ఇటీవల గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం బీరవల్లిపాలెం గ్రామానికి చెందిన బుకీ పసుపులేటి నాగరాజుతో పాటు భోపాల్‌కు చెందిన మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరి ద్వారా వెబ్‌సైట్‌ యజమానిని పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రానికి చెందిన అభీర్‌ చందగా గుర్తించారు. అతను ఆ రాష్ట్రంలోని కూచ్‌బిహార్‌ జిల్లా దిన్లాటా గ్రామంలో ఉన్నట్లు తెలుసుకుని శనివారం అదుపులోకి తీసుకున్నారు.

అక్కడ కోర్టులో హాజరు పరిచి గుంటూరుకు తరలించారు. కోల్‌కత్తాకు చెందిన సాఫ్ట్‌వేర్‌ డిజైనర్‌ సాయన్‌ గోష్‌కు సోమవారం గుంటూరులో విచారణకు హాజరుకావాలని నోటీసు జారీ చేశారు. నిందితుడు అభీర్‌ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా మొత్తం 12 మంది మాస్టర్‌ బుకీలు ఉన్నారు. వారి పరిధిలో 50 మంది మాస్టర్‌ డిస్ట్రిబ్యూటర్లు, 60 మంది ప్రధాన బుకీలు, 400 మంది సబ్‌ బుకీలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు.

ఇక పంటర్స్‌ దేశవ్యాప్తంగా వేలాది మంది ఉన్నారు. ఇతర దేశాల్లో అధికారికంగా బెట్టింగ్‌కు లైసెన్సులు ఉన్నందున అక్కడ నుంచి సాఫ్ట్‌వేర్‌ కొని వివిధ క్రీడల బెట్టింగ్‌కు అనుకూలంగా రూపొందించారు. వాటిలో మన దేశంలో ప్రధానంగా 6 రకాల క్రీడల్లో బెట్టింగ్‌లు జరుగుతున్నట్లు గుర్తించారు. నిందితుడి వద్ద నుంచి రెండు ల్యాప్‌టాప్‌లు, ఐదు సెల్‌ఫోన్లు, బంగారు చైను, బ్రేస్‌లెట్‌తో పాటు బ్యాంకు ఖాతాలో ఉన్న రూ. 7 లక్షల నగదును సీజ్‌ చేశారు. గేమింగ్‌ యాక్ట్, ఐటీ యాక్ట్‌తో పాటు సెక్షన్‌ 420 ప్రకారం కేసు నమోదు చేశారు.

దేశవ్యాప్తంగా ఉన్న బుకీలను అరెస్టు చేసేందుకు ఏఎస్పీ ఎస్‌ వరదరాజు ఆధ్వర్యంలో 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించనున్నారు. జిల్లాకు చెందిన బుకీలు కొందరిని ఇప్పటికే గుర్తించారు. వారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందం గాలిస్తోంది. నిందితుడిని అరెస్టు చేసిన బృందం సభ్యులను ఈ సందర్భంగా ఎస్పీ అభినందించారు. సమావేశంలో ఏఎస్పీ ఎస్‌.వరదరాజు, డీఎస్పీ యు కాలేషావలి, సిబ్బంది పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

టైర్‌ పేలి లారీని ఢీకొన్న ఇన్నోవాకారు

జైలులో జీవిత ఖైదీ ఆత్మహత్య

విషాదం: లిఫ్ట్‌ వైర్ తెగి ఇద్దరి కార్మికుల మృతి

ఫ్రెండ్స్‌తో పార్టీ.. రూ. 5 వేల కోసం..

ఆస్తి వివాదం : 9 మంది మృతి

సీబీఐ వలలో ఎక్సైజ్‌ అధికారి

సెల్ఫీ వీడియో; నాకు చావే దిక్కు..!

అమీర్‌పేటలో బాంబు కలకలం

దాచాలంటే దాగదులే!

వేర్వేరు చోట్ల ఐదుగురు ఆత్మహత్య

హత్య చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు

ప్రేమ పెళ్లి చేసుకొన్న ఆటోడ్రైవర్‌ ఆత్మహత్య!

బస్సులో మహిళ చేతివాటం! ఏకంగా కండక్టర్‌కే..

పెళ్లైన 24 గంటలకే విడాకులు

అత్తింటి ఆరళ్లు! అన్నను ఎందుకు రానిచ్చవంటూ...

ఖాకీ వేషంలో ఉన్న దొంగల అరెస్టు

నగ్నంగా ఉంటే నయమవుతుంది!

నెత్తురోడిన రహదారులు

ఆ రెండు కమిషనరేట్లలో 1000 మంది రౌడీ షీటర్లు!

తప్పతాగి.. పోలీసుపై మహిళ వీరంగం!

చివరిసారిగా సెల్ఫీ..

పెళ్లి పేరుతో మోసం నటుడి అరెస్ట్‌

సినీ నటితో అసభ్య ప్రవర్తన

మోసం.. ఆపై ఆత్మహత్యాయత్నం.!

14 ఏళ్ల బాలికను వేధించిన 74 ఏళ్ల వృద్ధ మృగాడు!

కుమార్తె వద్దకు వెళ్లి తిరిగి వస్తూ..

రాజాంలో దొంగల హల్‌చల్‌

నన్ను ప్రేమించలేదు..అందుకే చంపేశాను

ఫేస్‌బుక్‌ రిలేషన్‌; వివాహితపై అత్యాచారం

రాంప్రసాద్‌ హత్య కేసులో మరో నలుగురు రిమాండ్‌ 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తమిళ ఆటకు రానా నిర్మాత

నా ఫిట్‌నెస్‌ గురువు తనే

మిస్‌ ఫిజియో

చాలామందికి నా పేరు తెలియదు

ఇదొక అందమైన ప్రయాణం

నవ్వుల నవాబ్‌