ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ డేటాబేస్‌ మాయం | Sakshi
Sakshi News home page

ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ డేటాబేస్‌ మాయం

Published Mon, Dec 30 2019 5:10 AM

Personal data of 45 lakh ex-servicemen goes missing - Sakshi

న్యూఢిల్లీ: 45 లక్షల మంది త్రివిధ దళాల మాజీ సిబ్బందికి సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని తిరిగి ఇవ్వలేదంటూ ఒక ప్రైవేటు సంస్థపై ఢిల్లీలో కేసు నమోదు అయింది. రక్షణ శాఖ ఫిర్యాదు మేరకు ‘స్కోర్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ లిమిటెడ్‌(ఎస్‌ఐటీఎల్‌)’ సంస్థపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. నౌకాదళ మాజీ అధికారి లోకేశ్‌ బత్రా ఈ వివరాలను సమాచార హక్కుచట్టం(ఆర్టీఐ) ద్వారా సంపాదించారు. ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ కంట్రిబ్యూటరీ హెల్త్‌ స్కీమ్‌(ఈసీహెచ్‌ఎస్‌) అమలు కోసం స్మార్ట్‌ కార్డ్స్‌ను రూపొందించేందుకు ఎస్‌ఐటీఎల్‌కు 2010లో కాంట్రాక్ట్‌ ఇచ్చారు. ఇందులో భాగంగా, సాయుధ దళాల మాజీ సిబ్బంది వ్యక్తిగత సమాచారాన్ని వారికి ఇచ్చారు. 2015లో ఆ కాంట్రాక్ట్‌ ముగిసింది. ఆ తరువాత, డేటాలో మార్పుచేర్పులకు అవసరమైన సోర్స్‌ కోడ్, కీ సహా మొత్తం డేటాబేస్‌ను రక్షణ శాఖకు తిరిగి ఇచ్చేయాల్సి ఉంది. కానీ, ఎస్‌ఐటీఎల్‌ అలా చేయలేదు. కనీసం ఆ డేటా తమ వద్ద లేదన్న విషయాన్ని కూడా ఆ సంస్థ చెప్పడం లేదని పేర్కొంది.

Advertisement
Advertisement