ఇద్దరు దొంగలు అరెస్ట్‌: 159 గ్రాముల బంగారం స్వాధీనం

11 Sep, 2019 09:26 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు వెనుక నిందితులు  

సాక్షి, పశ్చిమగోదావరి(నరసాపురం) : ఉభయగోదావరి జిల్లాల్లో పలు ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను పెనుగొండ పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. వేర్వేరు రెండు కేసుల్లో అరెస్ట్‌ చేసిన వీరి వద్ద నుంచి రూ.5.23 లక్షలు విలువచేసే 159 గ్రాముల బంగారం, 230 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం సాయంత్రం నరసాపురం సీఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నరసాపురం డీఎస్పీ ఎం.నాగేశ్వరరావు వివరాలు వెల్ల డించారు. కాకినాడకు చెందిన పాలిక దుర్గాప్రసాద్‌ రావులపాలెంలో లారీ క్లీనర్‌గా పనిచేస్తూ ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నాడు. 2011 నుంచి ఇతనిపై 10కిపైగా కేసులు ఉన్నా యి. రెండుసార్లు పలు కేసుల్లో ఏదాదిన్నర జైలు శిక్ష కూడా అనుభవించాడు. తూర్పుగోదావరి జిల్లా సర్పవరం, ఏలేశ్వరం, తిమ్మాపురం, కోరంగి, అమలాపురం, కొత్తపేట, పి ఠాపురం ప్రాంతాల్లో చోరీలు చేశాడు. తాజాగా పెనుగొండలో ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. అతడిని పెనుగొండలో పో లీసులు అరెస్ట్‌ చేసి 123 గ్రాముల బంగారం, 230 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.

అలాగే పెనుగొండకు చెందిన మరోవ్యక్తి కోసూరి కరుణ అనే యువకుడు భీమవరం, పాలకొల్లు, పోడూరు, తణుకు, ఇరగవరం, అమలాపురం, రావుపాలెం, నరసాపురం, పి.గన్నవరం ప్రాం తాల్లో జిల్లెళ్ల రాకేష్, పందరి వెంకటనారాయణతో కలిసి చో రీలు చేశాడు. ఇప్పటికే జిల్లెళ్ల రాకేష్, పందరి వెంకటనా రాయణను పోలీసులు అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు. అయితే కరుణ మాత్రం పోలీసులకు దొరకకుండా ముంబై పారిపోయాడు. ఈనేపథ్యంలో కోసూరి కరుణ పెనుగొండకు వచ్చినట్టు సమాచారం రావడంతో పోలీసులు పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి 36 గ్రాముల బంగారు వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. పెనుగొండ సీఐ సునీల్‌కుమార్, ఎస్సై పి.నాగరాజు, పెనుమంట్ర, ఇరగవరం ఎస్సైలు బి.శ్రీనివాస్, డి.ఆదినారాయణ నిందితులు ఇద్దరినీ ప ట్టుకోవడంలో చురుగ్గా వ్యవహరించారని డీఎస్పీ చెప్పారు. నరసాపురం సీఐ బి.కృష్ణకుమార్, టౌన్‌ ఎస్సై ఆర్‌.మల్లికార్జునరెడ్డి పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు