నాడు పోలీస్‌.. నేడు దొంగ  | Sakshi
Sakshi News home page

నాడు పోలీస్‌.. నేడు దొంగ 

Published Wed, Oct 18 2017 1:44 AM

Police became as theft - Sakshi

పెందుర్తి: అతడు ఒకప్పడు పోలీస్‌. దురాశ, వ్యసనాల కారణంగా కరుడుగట్టిన గజదొంగగా మారాడు. అనేక దొంగతనాల్లో నిందితుడిగా ఉన్న అతడిని విశాఖపట్నం జిల్లా పెందుర్తి పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి 442 గ్రాముల బంగారు ఆభరణాలు, 812 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. రాజమహేంద్రవరానికి చెందిన అన్నాబత్తుల సత్యశ్రీనివాసరావు అలియాస్‌ అద్దాల శ్రీను 1998లో సివిల్‌ కానిస్టేబుల్‌గా ఉద్యోగం పొందాడు.

పోలీస్‌గా ఉన్న సమయంలో అదే ప్రాంతానికి చెందిన ప్రసాద్‌ అనే వ్యక్తితో రైస్‌ పుల్లింగ్‌ కాయిన్స్‌ వ్యాపారం ప్రారంభించాడు. అందులో నష్టం రావడంతో 2015 నుంచి దొంగతనాల బాట పట్టి ఉద్యోగాన్ని వదిలేశాడు. రాజమండ్రికే చెందిన రవిచంద్రతో కలసి దొంగతనాలు చేసేవాడు. వీరిపై పెందుర్తి, పోతినమల్లయ్యపాలెం, గాజువాక, దువ్వాడ పోలీస్‌స్టేషన్లలో 9 కేసులు నమోదయ్యాయి. ఈ నెల 14న కృష్ణరాయపురంలో రవిచంద్రను అరెస్ట్‌ చేసిన పోలీసులు అతడిచ్చిన సమాచారంతో శ్రీనును అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
Advertisement