మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు | Sakshi
Sakshi News home page

మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు

Published Tue, Jul 10 2018 7:37 AM

Police Reveals Women Murder Case - Sakshi

రొంపిచెర్ల: సంవత్సరం క్రితం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన గుర్తు తెలియని మహిళ కేసును రొంపిచెర్ల పోలీసులు ఛేదించారు. విశ్వనీయ సమాచారం మేరకు.. రొంపిచెర్ల మండలం పెద్దమల్లెల పంచాయతీ దుస్సావాండ్లపల్లెకు చెందిన నాగిరెడ్డి(38) కలికిరి మండలం మంచూరుకు చెందిన అనిత(34)ను వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కొడుకు ఉన్నాడు. వీరు బతుకుదెరువు కోసం 10 ఏళ్ల క్రితం బెంగళూరు వెళ్లారు. అక్కడ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని భర్త అనుమానించాడు. భార్యను అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. తన అన్న కృష్ణారెడ్డితో కలిసి బెంగళూరు నుంచి వ్యాన్‌లో స్వగ్రామం వెళదామని నాగిరెడ్డి భార్యను నమ్మించాడు. ఆమె భర్తతో కలసి 2017 జూన్‌ 30వ తేది రాత్రి వ్యాన్‌లో వచ్చింది. ఈ క్రమంలో నాగిరెడ్డి దుస్సావాండ్లపల్లె వద్దకు వచ్చిన తర్వాత పక్కనే ఉన్న చెరువు వద్దకు భార్యను తీసుకుని వెళ్లి తన అన్నతో కలిసి కొట్టి చంపేశారు. అనంతరం మృతదేహంపై కిరోసిన్‌ పోసి నిప్పు పెట్టారు. కాలిన శవాన్ని చెరువులోని ఇసుక గుంతలో పూడ్చి పెట్టారు. జూలై 9వ తేదీ సాయంత్రం మృతురాలి కాలు బయటపడింది.

గమనించిన స్థానికులు రొంపిచెర్ల పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పుటి రొంపిచెర్ల ఎస్‌ఐ రహీముల్లా సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని వెలికితీయించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతురాలు పెద్దమల్లెల పంచాయతీ దుస్సావాండ్లపల్లెకు చెందిన నాగిరెడ్డి(38) భార్య అనితగా పోలీసులు గుర్తించారు. సోమవారం ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో మృతురాలి భర్త, బావ నేరం అంగికరించినట్టు తెలిసింది. ఈ కేసులో నిందితులు ఇంకా కొందరు ఉండే అవకాశం ఉందని పలువురు అనుమానిస్తున్నారు. పోలీసులు సమగ్రంగా విచారణ జరిపితే వాస్తవాలు బయటకు వస్తాయని ప్రజలు చెబుతున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement