అనుమానాస్పద స్థితిలో గర్భిణి మృతి

23 Mar, 2020 08:47 IST|Sakshi
వివాహం నాటి కార్తిక–వరప్రసాద్‌ దంపతుల చిత్రం ,మృతి చెందిన కార్తిక (ఫైల్‌)

పోలీసుల అదుపులో భర్త ఆర్డీఓ దర్యాప్తు

చెన్నై , పళ్లిపట్టు: గర్భిణీ అనుమానాస్పద మృతి సంబంధించి ఆమె భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ఆర్డీఓ దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన పళ్లిపట్టు ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాలు..మండలంలోని నెడియం దళితవాడకు చెందిన  వరప్రసాద్‌(24) ట్యాక్సీ డ్రైవర్‌. ట్యాక్సీ నడిపే సమయంలో చెంగల్పట్టులో డిగ్రీ తొలి ఏడాది చదివే అదూ ఊరికి చెందిన కార్తిక(21)తో పరిచయం ఏర్పడి ప్రేమకు దారితీసింది. ఇరు కుటుంబీకుల సమ్మతంతో రెండేళ్ల కిందట వివాహం చేసుకున్నారు. దంపతులు నెడియం దళితవాడలో కాపురం ఉన్నారు. ఐదు నెలల గర్భిణీ అయిన కార్తిక ఆరోగ్యం విషమించిందని పేర్కొంటూ ఆమె భర్త శనివారం కోనేటంపేటలోని మండల ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.  పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తిరుత్తణి ప్రభుత్వాస్పత్రికి తరిలించారు. 

మృతిపై కార్తిక తండ్రి ఫిర్యాదు
తమ కూతురు మృతిపై అనుమానం ఉందని కార్తిక తండ్రి పళ్లిపట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో భర్త వరప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా వివాహం జరిగిన రెండేళ్లలోనే మృతి చెందిన ఘటనకు సంబంధించి తిరుత్తణి ఆర్డీఓ దర్యాప్తు చేపట్టారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా