ఉన్నది ఊడ్చుకెళ్లారు..! | Sakshi
Sakshi News home page

ఉన్నది ఊడ్చుకెళ్లారు..!

Published Sun, Mar 11 2018 10:52 AM

Robbery In kamareddy - Sakshi

కామారెడ్డి క్రైం: దైవదర్శనానికి వెళ్లి వచ్చేసరికి ఓ ఇంటిని గుల్ల చేశారు దుండగులు. ఇంట్లో ఉన్నది ఊడ్చుకెళ్లారు. జిల్లా కేం ద్రంలో శుక్రవారం రాత్రి దొంగలు భీబత్సం సృష్టించారు. దేవునిపల్లిలో ఓ ఇంటి వద్ద మహిళపై దా డి చేసి మెడలోంచి 3 తులాల బంగారం గొ లుసు దోచుకున్నారు. అడ్డొచ్చిన భర్త ను, మహిళను తీవ్రంగా గాయపర్చారు. మరో ఘటనలో తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ చేశారు. ఏకంగా 57 తులాల బంగారం, లక్షన్నర నగదు అపహరించారు. ఈ వరుస ఘటనలు కామారెడ్డిలో కలకలం రేపాయి. జనం భయబ్రాంతులకు గురవుతున్నారు.

దంపతులపై దాడి చేసి..
ఓ మహిళపై ఇద్దరు ఆగంతకులు దాడి చేసి గొలుసు అపహరించుకుపో యిన సంఘటనలో దంపతులకు తీవ్రంగా గాయాలయ్యా యి. పట్టణానికి ఆనుకుని ఉన్న దేవునిపల్లి ప్రభుత్వ పాఠశాల ఎదురుగా కొత్త వెంచర్‌లో రోడ్డు పక్కనే ఉన్న ఇంటిని లింగాపూర్‌కు చెందిన వైద్య వెంకట్రావు, కల్పన దంపతులు రెండెళ్ల క్రితం కొనుగోలు చేసి నివాసం ఉంటున్నారు. అంగన్‌వాడీ టీచర్‌గా పని చేసే కల్పన శుక్రవారం రాత్రి 7:45 గంటల ప్రాంతంలో మార్కెట్‌ నుంచి ఇంటికి తిరిగి వచ్చింది. ఆమె ఇంట్లోకి వెళ్తుండగా వెనక నుంచి అకస్మాత్తుగా ఇంటి గుమ్మం ముందు దొంగలు దాడి చేశారు. వారిలో ఒకడు గొం తు నులుమి మెడలోంచి గొలుసు లాగెందుకు ప్రయత్నించాడు. ఇంట్లో నుంచి ఆమె భర్త వెంకట్రావు బయటకు వచ్చి దుండగులను అడ్డుకున్నాడు. ప్రతిఘటించిన దంపతులపై దుండగులు రాళ్లతో దాడి చేసి తీ వ్రంగా గాయపరిచారు. కల్పన మెడలోంచి మూడు తులాల బం గారం గొలుసు ఎత్తుకెళ్లారు. కేకలు వేయడంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో బాధితులు లబోదిబోమంటూ దేవునిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ సంతోష్‌కుమార్‌ విచారించారు.

కూతురు పెళ్లి కోసం..
కామారెడ్డి మండలంలోని వడ్లూర్‌ గ్రామానికి చెందిన రొండ్ల జితేందర్‌రెడ్డి ఆర్టీసీలో ఉద్యోగి. జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌ కాలనీలో కొంత కాలంగా ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. బుధవారం కుటుంబంతో కలిసి దైవ దర్శనం కోసం ఇంటికి తాళం వేసి తిరుపతికి వెళ్లాడు. ఇటీవల గ్రామంలో భూమిని విక్రయించగా వచ్చిన డబ్బుతో కూతురు పెళ్లికి పనికి వస్తుందని 30 తులాల బంగారం కొన్నా డు. దాంతోపాటు మిగతా బంగారం కలిపి మొత్తం 57 తులాలు, రూ.లక్షన్నర ఇం ట్లోని బీరువా లాకర్‌లో దాచి వెళ్లారు. శుక్రవారం అర్ధరాత్రి ఇంటికి తాళం వేసి ఉం డడాన్ని గమనించిన దుండగులు తాళం పగులగొట్టి చొరబడ్డారు. వస్తువులను చిందరవందర చేసి బీరువాలోని నగదు, బంగారు దోచుకెళ్లారు. ఉదయాన్నే చోరీ జరిగినట్లు గమనించిన చుట్టపక్కల వారు, ఇంటి యజమానికి, పోలీసులుకు సమాచారం ఇచ్చారు. దీంతో కామారెడ్డి డీఎస్పీ ప్రసన్నరాణి, ఎస్‌హెచ్‌వో శ్రీధర్‌కుమార్, ఎస్‌ఐ యాదగిరి గౌడ్, ఏఎస్‌ఐ రాములు సిబ్బందితో సహా సంఘటన స్థలాన్ని పరిశీలించి విచారించారు. పెద్దమొత్తంలో నగదు, బంగారం ఇంట్లో పెట్టి పుణ్యక్షేత్రాలకు వెళ్లడం ఏంటని పోలీసులు, చుట్టుపక్కలవారు అవాక్కయ్యారు. కనీసం ఈ ప్రాంతంలోని ఇండ్లలో సీసీ కెమరాలు కూడా లేవు. క్లూస్‌ టీంతో ఆధారాలను సేకరించారు. దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని డీఎస్పీ తెలిపారు. ప్రస్తుతం ఆర్టీసీ ఉద్యోగి కుటుంబ సభ్యులు తీర్థయాత్రను హుటాహుటిన బయలుదేరినట్లు సమాచారం.

Advertisement
Advertisement