పాఠశాలలో విషపురుగు కుట్టి చిన్నారి మృతి | Sakshi
Sakshi News home page

పాఠశాలలో విషపురుగు కుట్టి చిన్నారి మృతి

Published Thu, Jun 14 2018 11:51 AM

School Kid Kid Died With Snake Bite In Kurnool - Sakshi

నంద్యాల: పాఠశాలకు వెళ్లిన మొదటి రోజే విషపురుగు కుట్టి చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన కొలిమిగుండ్ల మండలం పెద్దవెంతర్ల గ్రామంలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబం కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. పెద్దవెంతర్ల గ్రామానికి చెందిన పుల్లయ్య, నాగేశ్వరమ్మ కుమార్తె గోపిక లక్ష్మి(6) స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చేరింది. బుధవారం పాఠశాలకు వెళ్లింది. వెళ్లిన గంటకే ఏదో విషపురుగు కుట్టడంతో ఆ విషయాన్ని టీచర్‌కు చెప్పింది. చిన్నారిని కూర్చోబెట్టి వివరాలు అడుగుతుండగానే శరీరమంతా చల్లబడింది. దీంతో టీచర్‌ చిన్నారి కుటుంబ సభ్యులకు విషయం తెలిపారు. వారు ఆ చిన్నారిని కోవెలకుంట్ల ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి నంద్యాల ప్రభుత్వాసుపత్రికి రెఫర్‌ చేశారు. ఇక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక సాయంత్రం మృతి చెందింది. పుల్లయ్య, నాగేశ్వరమ్మలకు ఇద్దరు కుమారులు, కుమార్తె సంతానం. కుమార్తె లక్ష్మి విషపురుగు కుట్టి చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.

Advertisement
Advertisement