సంచలన కేసులో రానున్న తీర్పు : భారీ భద్రత 

10 Jun, 2019 09:35 IST|Sakshi

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా హత్యాచారం కేసులో తుది తీర్పు నేడు (సోమవారం, జూన్‌ 10) వెలువడనుంది. పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్‌ కోర్టులో  విచారణ ముగిసిన నేపథ్యంలో న్యాయమూర్తులు తీర్పును వెలువరించనున్నారు. దీంతో పఠాన్‌కోట్‌లో భద్రతను కట్టుదిట్టం  చేశారు. భారీగా పోలీసులను మోహరించారు. ఎలాంటి అంవాఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్తగా  గట్టి చర్యలు చేపట్టారు.

కాగా జమ్ముకశ్మీర్‌లోని కథువాలో ఎనిమిదేళ్ల బాలికను అత్యంత దారుణంగా ఆలయంలోనే హత్యాచారం చేశారు. బాలికకు మత్తు పదార్థాలు ఇచ్చి, సామూహిక అత్యాచారం, హత్య చేసిన ఈ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది.  అత్యంత పాశవికమైన ఈ ఘటన పట్ల నిరసనలు హోరెత్తాయి. అయితే ఈ కేసు విచారణకు జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో సుప్రీంకోర్టు పఠాన్‌కోట్‌ కోర్టుకు బదిలీ చేసింది. ఈ కేసులో ఎనిమిదిమంది నిందితులు ఉండగా..వారిలో ఏడుగురిపై ఛార్జ్‌షీట్ దాఖలైంది. నిందితులకు ఉరి శిక్ష విధించాలన్న డిమాండ్‌ కూడా  ఊపందుకున్న సంగతి తెలిసిందే.   
 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు