తల్లీకూతుళ్లపై మాల్‌ ఓనర్‌ కీచకత్వం.. దారుణం!

20 Jan, 2019 17:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగర శివారులోని మైలార్‌దేవ్‌పల్లిలో దారుణం చోటుచేసుకుంది. షాపింగ్‌మాల్‌లో పనిచేస్తున్న అమ్మాయిని మాల్‌ యాజమాని లైంగికంగా వేధించాడు. అంతేకాకుండా ఆ అమ్మాయిని తన వద్దకు పంపాలంటూ ఏకంగా ఆమె తల్లిని కూడా వేధించడం మొదలుపెట్టాడు. యాజమాని వేధింపులు తట్టుకోలేక అమ్మాయి తల్లి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

కాటేదాన్‌లోని మౌనిక వస్త్రాల షాపింగ్‌మాల్‌లో పనిచేస్తున్న ఓ అమ్మాయి పట్ల ఆ మాల్‌ యజమాని పులిజల వివేకానంద (40 సంవత్సరాలు) లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. షాపులో పనిచేస్తున్న యువతిపై కన్ను వేసిన యాజమాని.. ఆమెను తన లైంగిక అవసరాలు తీర్చేందుకు పంపాలంటూ ఆమె తల్లిని కన్యాకుమారి (45)ని కూడా వేధించడం మొదలు పెట్టాడు. ఇలా ఇద్దరిపై లైంగిక వేధింపులకు దిగడంతో కన్యాకుమారి ఆదివారం ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. షాపింగ్‌మాల్‌ యజమానిని అరెస్టు చేశారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నోరు మూసి బలవంతంగా లాక్కెళ్లి గేటు వేశాడు

కేసు ముగించే కుట్ర 

మార్చి.. ఏమార్చి

మొగల్తూరులో విషాదం

‘సరదా కోసం ఉగ్రవాద సంస్థ పేరు పెట్టా’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సైలెంట్‌గా ఉన్నారు

నెక్ట్స్‌ ఏంటి?

వాళ్ల మైండ్‌సెట్‌ మారుతుందనుకుంటున్నా

ప్రేమ సందేశాలు

అందుకే వద్దనుకున్నా!

హత్య చేసిందెవరు?