తాబేళ్ల అక్రమ రవాణా

24 Aug, 2018 12:57 IST|Sakshi
  స్వాధీనం చేసుకున్న తాబేళ్లు 

భువనేశ్వర్‌ : రాష్ట్రం సరిహద్దులో తాబేళ్ల అక్రమ రవా ణా గుట్టు రట్టయింది.  చాందీపూర్‌ అటవీ శాఖ పోలీసులు, బాలాసోర్‌ రైల్వే రక్షక దళం ఉమ్మడి ప్రయత్నంతో ఈ గుట్టు రట్టయింది. పొరుగు రాష్ట్రం పశ్చిమ బెంగాల్‌కు ఈ తాబేళ్లను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు అందిన సమాచారం ఆధారంగా ఈ రెండు వర్గాలు ఆకస్మికంగా దాడి చేశా యి. రాజ్‌ఘాట్‌ రైల్వేస్టేషన్‌లో ఆకస్మికంగా దాడి చేపట్టారు.

ఈ దాడిలో 4 జాతుల 91 తాబేలు పిల్లల్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనలో ఇద్దరు నిందితుల్ని అరెస్ట్‌  చేశారు. ఇద్దరు వ్యక్తుల సందిగ్ధ కదలిక నేపథ్యంలో రైల్వే రక్షక దళం ఈ వర్గంపై దృష్టి సారించింది. పోలీసు దళాలు అరెస్ట్‌ చేసిన ఇద్దరు నిందితుల్లో ఒకరిని పశ్చిమ బెంగాల్‌లోని బాలాసోర్‌ జిల్లా బొగొరాయి ప్రాంతీయుడుగా గుర్తించారు.

వీరిద్దరూ తరచూ ఇటువంటి అక్ర మ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు సమాచా రం అందినట్లు చాందీపూర్‌ అటవీ శాఖ పోలీసు లు తెలిపాయి. స్వాధీనం చేసుకున్న 91 తాబేలు పిల్లల్ని సువర్ణరేఖ, సముద్ర సంగమం కేంద్రంలో విడిచి పెట్టనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ముమ్మాటికి కుట్రతోనే ‘విధ్వంసం’

నెల్లూరులో కారు బీభత్సం.. పలువురికి తీవ్ర గాయాలు

యువకుడిపై హత్యాయత్నం

రెలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

నేనెలా బతకాలి కొడకా..?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వార్‌కి రెడీ

గీతమ్మా... నువ్వెవ‌రమ్మా?

న‌ల్ల తంబి

డైరెక్షన్‌ మారుతోంది

రాకింగ్‌ స్టార్‌తో ప్రభాస్‌..!

‘నిజంగా నేను తప్పుచేశాను.. క్షమించండి’