తండ్రిని పోలీసులు వేధిస్తున్నారని.. | Sakshi
Sakshi News home page

తండ్రిని పోలీసులు వేధిస్తున్నారని..

Published Mon, Nov 6 2017 2:43 AM

software engineer suicide because of police harassment to his father - Sakshi

మెట్‌పల్లి రూరల్‌: తన తండ్రిని పోలీసులు వేధిస్తున్నారని తట్టుకోలేక ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం ఆరపేటకు చెందిన రైతు కోసరి రాజారెడ్డికి 63వ జాతీయ రహదారి పక్కన ఇల్లు ఉంది. దానిని ఆనుకునే వివాదాస్పద స్థలం ఉంది. ఇటీవల ఆ స్థలాన్ని రాజారెడ్డి చదును చేయించగా, ఓ ప్రార్థనా మందిరం నిర్వాహకులు పోలీస్‌స్టేషన్‌లో రాజారెడ్డిపై కేసు పెట్టారు.

ఈ విషయమై పలుసార్లు రాజారెడ్డిని విచారణ నిమిత్తం పోలీసులు స్టేషన్‌కు పిలిచారు. ఈ విషయాన్ని బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న తన కుమారుడు దశరథ్‌రెడ్డికి తెలపడంతో ఆయన శనివారం ఆరపేటకు వచ్చాడు. తండ్రి తగాదాని తెలుసుకున్న దశరథ్‌రెడ్డి మనస్తాపానికి గురై ఆదివారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

Advertisement
Advertisement