అరకు విహారయాత్రలో విషాదం..

2 Feb, 2020 16:49 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : అరకులో విషాదం చోటుచేసుకుంది. భీమవరం డీఎన్ఆర్ కాలేజీకి చెందిన 50 మంది విద్యార్థులు ఆదివారం కావడంతో.. అరకు అందాలు తిలకించడానికి విహారయాత్రకు వచ్చారు. ప్రముఖ సందర్శక ప్రాంతమైన బొర్రా గృహాలు రైల్వే గేట్ వద్ద ప్రమాదవశాత్తు పర్యాటక బస్సులో నుంచి ఓ యువకుడు కిందపడిపోయాడు. ఈ క్రమంలోనే పర్యాటక బస్సు అతనిపై నుంచి దూసుకుని పోయింది. ఈ ప్రమాదంలో ప్రేమ్ కుమార్ (21) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో విద్యార్థుల విహారయాత్రంలో విషాదం నెలకొంది. ఈ ఘటనతో తోటి విద్యార్థులు కన్నీరుమున్నీరవుతున్నారు.
 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు