మహిళపై లైంగికదాడికి టీడీపీ నేత యత్నం | Sakshi
Sakshi News home page

Published Tue, Dec 18 2018 11:42 AM

TDP Leader Tried To Molest Woman in Krishna District - Sakshi

కోనేరు సెంటర్‌(మచిలీపట్నం): కామంతో కళ్లు మూసుకుపోయిన అధికార టీడీపీ నాయకుడు పక్కింటి మహిళపై లైగింక దాడికి ప్రయత్నించాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా బందరు మండలం పోతిరెడ్డిపాలెం శ్రీనివాసనగర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. బాధితురాలి  ఫిర్యాదు మేరకు సోమవారం బందరు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో టీడీపీ నేతపై కేసు నమోదైంది. శ్రీనివాస్‌నగర్‌కు చెందిన మహిళ రోల్డుగోల్డు పనులు చేస్తూ జీవిస్తోంది. ఆమె భర్త మేకలను పెంచుతుంటాడు. పేదరికంతో బాధపడుతున్న భార్యభర్తలు తలదాచుకునేందుకు కొద్దిపాటి స్థలం ఇప్చించమని టీడీపీ నేత మేక గంగాధరాన్ని ఆశ్రయించారు. సరేనన్న గంగాధరం స్థలం కోసం ఆమె చేత దగ్గరుండి దరఖాస్తు చేయించాడు.

ఈ నెల 16న పేపర్ల మీద మరో సంతకం పెట్టాలంటూ గంగాధరం సదరు మహిళను ఇంటికి పిలిచాడు. సంతకం చేసేందుకు వచ్చిన ఆమెను తన కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు. ఆమె నిరాకరించటంతో లైంగికదాడికి ప్రయత్నించాడు. మహిళ భయంతో కేకలు పెట్టింది. పశువులను మేపుతున్న కుమారుడు వెంటనే గంగాధరం ఇంటికి పరుగు తీశాడు. తలుపులు పగులగొట్టేందుకు ప్రయత్నించాడు, లోపల తల్లి కేకలు, బయట కొడుకు అరుపులకు భయపడిన గంగాధరం ఆమెను వదిలేశాడు. బాధితురాలు ఆదివారం రాత్రి జరిగిన సంఘటనపై బందరు రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు గంగాధరంను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. నిందితుడికి 15 రోజుల రిమాండ్‌ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. 

Advertisement
Advertisement