ఉగ్రవాదుల చెరలో ఉండగానే ముగ్గురు పిల్లలు | Sakshi
Sakshi News home page

ఐదేళ్ల తర్వాత ఉగ్రవాదుల నుంచి విముక్తి

Published Thu, Oct 12 2017 7:20 PM

 us family finally saved from terrorists - Sakshi

ఇస్లామాబాద్ ‌(పాకిస్తాన్‌) : ఐదేళ్లపాటు తాలిబన‍్ల చెరలో ఉన్న అమెరికా కుటుంబాన్ని పాకిస్తాన్‌ బలగాలు సురక్షితంగా రక్షించాయి. కెనడా దేశస్తుడు జోషువా బోయెల్‌, అమెరికాకు చెందిన కైట్లాన్‌ కోల్‌మన్‌ అనే దంపతులు 2012లో విహారయాత్రకు అఫ్ఘానిస్తాన్‌కు వెళ్లారు. అక్కడ వారిని తాలిబన్లు బంధించారు. అప్పటికి కైట్లాన్‌ గర్భిణీ. అప్పటి నుంచి వారి జాడ తెలియకుండా పోయింది. ఎప్పటికప్పుడు వారిని ప్రాంతాలు మారుస్తూ ఉగ్రవాదులు తమ వెంట తిప్పుకున్నారు. బందీలుగా ఉండగానే వారికి ముగ్గురు సంతానం కలిగారు.

ఇటీవల ఆ ఐదుగురినీ తాలిబన్లు పాక్‌-అఫ్ఘాన్‌ సరిహద్దుల్లో ఖుర్రం గిరిజన జిల్లాలోకి తరలించారు. దీనిపై అమెరికా గూఢచార వర్గాలు ఉప్పందుకున్నాయి. ఎప్పటికప్పుడు ఆ సమాచారాన్ని పాకిస్తాన్‌ ప్రభుత్వానికి అందజేస్తూ వస్తున్నాయి. పకడ్బందీ వ్యూహం రూపొందించిన పాకిస్తాన్‌ సైన్యం బందీలున్న ప్రాంతంపై విజయవంతంగా దాడులు జరిపి వారిని సురక్షితంగా విడిపించారు. దంపతులు వారి ముగ్గురు చిన్నారులు సురక్షితంగా ఉన్నారని పాకిస్తాన్‌ వర్గాలు తెలిపాయి.

Advertisement
Advertisement