పెళ్లి కావడం లేదని ఆత్మహత్య! | Sakshi
Sakshi News home page

పెళ్లి కావడం లేదని ఆత్మహత్య!

Published Tue, Jun 18 2019 12:19 PM

Woman Commits Suicide For Not Getting Marriage In Yellareddy, Kamareddy - Sakshi

సాక్షి, ఎల్లారెడ్డి (కామారెడ్డి): కుటుంబంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా పెళ్లి కావడం లేదని మనస్తాపం చెందిన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఎల్లారెడ్డి పట్టణం లో సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై కమలాకర్‌ కథనం ప్రకారం.. ఎల్లారెడ్డికి చెందిన చిలక రాజమౌళి కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోంది. ఈ క్రమంలో రాజమౌళి ఉపాధి కోసం హైదరాబాద్‌కు వెళ్లిపోయాడు.

అయితే, కుటుంబంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆయన కుమార్తె స్వప్న (20)కు పెళ్లి చేయడం లేదు. ఈ విషయమై తల్లితో గొడవ పడిన స్వప్న ఇంట్లో ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుంది. మృతురాలి సోదరుడు సురేశ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

Advertisement
Advertisement