విశాఖలో కారు బీభత్సం

17 Sep, 2019 08:32 IST|Sakshi
విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొని ఆగిపోయిన కారు.. రోడ్డు మధ్యలో వేలాడుతున్న హైటెన్షన్‌ వైర్లు

బ్రేకులు ఫెయిలై విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టిన బీఎస్‌ఎన్‌ఎల్‌ వాహనం

ఈ ఘటనలో మహిళకు  తీవ్ర గాయాలు

డాబాగార్డెన్స్‌(విశాఖ దక్షిణ): పూర్ణామార్కెట్‌లో సోమవారం ఓ కారు బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిలై వేగంగా దూసుకెళ్తూ ఓ మహిళతో పాటు విద్యుత్‌ స్తంభాన్ని సైతం బలంగా ఢీకొని ఆగిపోయింది. దీంతో ఆ స్తంభం కారుపై ఒరిగిపోయింది. కారుపై విద్యుత్‌ తీగలు పడి ఉంటే పెను ప్రమాదం సంభవించి ఉండేది. అలాగే జనం కూడా ఆ సమయంలో తక్కువగా ఉండడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

బీఎస్‌ఎన్‌ఎల్‌కు చెందిన ఏపీ 09 బీఎన్‌ 1410 గల అంబాసిడర్‌ కారు డాబాగార్డెన్స్‌లోని సంస్థ కార్యాలయం నుంచి జగదాంబ జంక్షన్, పూర్ణామార్కెట్‌ మీదుగా వెలంపేటలోని బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయానికి బయలుదేరింది. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో జగదాంబ జంక్షన్‌ దాటి పూర్ణామార్కెట్‌ దగ్గరికి వచ్చేసరికి ఆ కారుకు బ్రేకులు ఫెయిలయ్యాయి. వేగంగా దూసుకొస్తూ సాలిపేటకు చెందిన కేజీహెచ్‌ ఎస్‌–3 వార్డులో స్వీపర్‌(కాంట్రాక్ట్‌ వర్కర్‌)గా పని చేస్తున్న బండారు అప్పలనరసమ్మ(50)ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం కారు రోడ్డుకు కుడివైపున ఉన్న విద్యుత్‌ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో విద్యుత్‌ స్తంభం ఆ కారుపై పడిపోయింది. హైటెన్షన్‌ వైర్లు తెగిపడి రోడ్డుపై పడ్డాయి. విద్యుత్‌ శాఖ సిబ్బంది ఘటన జరిగిన 15 నిమిషాలు తరువాత వచ్చి సరఫరాను నిలిపివేశారు. అంతవరకు పోలీసులు ఘటన స్థలం వద్ద భదత్ర చర్యలు చేపట్టారు. గాయపడిన అప్పలనరసమ్మను చికిత్స కోసం పోలీసులు వెంటనే కేజీహెచ్‌కు తరలించారు. కారు డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అప్పటి వరకూ రద్దీగా ఉన్న పూర్ణామార్కెట్‌ జంక్షన్‌ అప్పుడే ఒక్కసారిగా ఖాళీగా కనిపించింది. లేదంటే కారు బీభత్సానికి ఎంత మంది బలయ్యేవారోనని స్థానికులు చర్చించుకున్నారు.

 బ్యాలెట్‌ బాక్సుల కోసం వెళ్తున్న కారు..
బీఎస్‌ఎన్‌ఎల్‌ గ్రూప్‌–సీ, డీ ఉద్యోగుల ఎన్నికలు సోమవారం జరిగాయి. డాబాగార్డెన్స్‌లోని జనరల్‌ మేనేజర్‌ కార్యాలయంతో పాటు వెలంపేటలోని బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయంలో కూడా ఎన్నికలు నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరిగింది. పోలింగ్‌ అనంతరం వెలంపేట బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయంలో జరిగిన ఎన్నికల బ్యాలెట్‌ బాక్సులు తీసుకొచ్చేందుకు డాబాగార్డెన్స్‌ జనరల్‌ మేనేజర్‌ కార్యాలయం నుంచి అంబాసిడర్‌ కారు బయలుదేరి వెళ్లింది. ఆ కారులో పలువురు బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారులు కూడా ఉన్నారు. పూర్ణామార్కెట్‌ వద్దకు వచ్చేసరికి కారుకు బ్రేకులు ఫెయిల్‌ కావడంతో ఈ ప్రమాదం సంభవించింది.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసండౌన్ లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

 వైద్యురాలి నిర్వాకం..

విద్యార్థిని బలిగొన్న టిప్పర్‌

సలసలా మసిలే నూనె పోసి..

ఏడు పెళ్లిళ్లు.. 24 మందిపై లైంగిక దాడి

పెళ్ళై పిల్లలున్నా ప్రేమను మరువలేక..

కొడుకే వేధించాడు

మాజీ స్పీకర్‌ కోడెల ఆత్మహత్య

సాయానికి వెళ్లి ప్రాణాలు కోల్పోయిన డాక్టర్‌..

పాత స్కూటర్‌ కోసం.. 97వేల మోసం

దారుణం: నడిరోడ్డుపై ఓ జంటను వెంటాడి..

కోడెల మృతిపై కేసు నమోదు

యువతి నగ్న వీడియోను ఆమె స్నేహితులకే..

వివాహిత దారుణ హత్య

అడ్డొచ్చిన వరాహాన్ని తప్పించబోయి అదుపుతప్పి..

ముసలి వయస్సులో అర్థం లేని అనుమానంతో..

ప్రధానోపాధ్యాయుడి దారుణ హత్య

భార్య చేతిలో.. భర్త హతం

అత్తారింట్లో అల్లుడి అనుమానాస్పద మృతి 

కూతురు పుస్తకాల కోసం వెళ్లి..

భార్య కాపురానికి రాలేదని ఆత్మహత్య

ప్రియుడితో కలిసి మరో ప్రియుడి హత్య

నల్లగొండలో గోదా'వర్రీ'

దొంగ మంత్రి శంకర్‌.. పమేరియన్‌ను చూస్తే పరుగే!

ఈ బైక్‌... చాలా కాస్ట్‌లీ గురూ..

హబ్సిగూడలో గ్యాంగ్‌ వార్‌

నకిలీ పోలీసుల హల్‌చల్‌

బాలికను అపహరించి, గొంతు కోసి..

వీరు మారరంతే..!

భార్య.. భర్త, ఓ స్నేహితుడు..

తమ్ముడిని కడతేర్చిన అన్న

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చిత్రపతుల చెట్టపట్టాల్‌

కామాక్షితో కాస్త జాగ్రత్త

కాలేజి పాపల బస్సు...

ఆర్‌డీఎక్స్‌ రెడీ

ఐస్‌ ల్యాండ్‌లో..

వేడుక వాయిదా