సెల్‌ఫోన్‌ చోరీ వివాదం.. యువకుడి హత్య

22 May, 2019 22:24 IST|Sakshi

సాక్షి, చెన్నై : సెల్‌ఫోన్‌ చోరీ వివాదం ఓ యువకుడి ప్రాణం తీసింది. ఈ సంఘటన గుమ్మడిపూండిలో సోమవారం రాత్రి చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిసిన వివరాల మేరకు.. బిహార్‌లోని సిక్కిందర్‌ మండలానికి చెందిన శశికుమార్‌ (22) సిప్‌కార్ట్‌ పారిశ్రామిక వాడలోని ప్రైవేటు కర్మాగారంలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. గుమ్మడిపూండి ఆంజనేయర్‌ ఆలయ వీధిలో అద్దె ఇంటిలో ఉంటున్నాడు. అతని ఇంటి సమీపంలో ఒడిశాకు చెందిన అజయ్‌తో సహా కొందరు కార్మికులు పని చేస్తున్నారు. ఈ క్రమంలో అజయ్‌ సెల్‌ఫోన్‌ చోరీ అయ్యింది. పక్క ఇంటిలో ఉంటున్న రాజేష్‌ చోరీ చేశాడని, అతనితో అజయ్‌ సోమవారం రాత్రి గొడవ పడ్డాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన శశికుమార్‌ రాజేష్‌కుమార్‌కు మద్దతుగా వాగ్వాదం చేశాడు. దీంతో వారి మధ్య రగడ ఏర్పడింది.

ఆగ్రహం చెందిన అజయ్‌ స్నేహితులు కలిసి శశికుమార్‌పై దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన శశికుమార్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పొన్నేరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై ఇన్‌స్పెక్టర్‌ జయకుమార్‌ ఏడుగురిని విచారణ చేస్తున్నారు. శశికుమార్‌ మృతి చెందిన సంగతి గురించి అతని బంధువులకు తెలియచేశారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

భార్య లేని జీవితమెందుకని..

మీ స్థలం దక్కాలంటే.. ముడుపు చెల్లించాల్సిందే..

స్నేహితుడిని చంపి.. ఆ తర్వాత భార్యను..

గల్ఫ్‌లో బందీ.. ఆగిన పెళ్లి 

తెలియనితనం.. తీసింది ప్రాణం

అవమానంతో ఆత్మహత్య

దొంగ దొరికాడు..

కారును ఢీకొన్న లారీ; ఇద్దరి మృతి

నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం..

మేనమామను కడతేర్చిన అల్లుడు

వాడు మనిషి కాదు.. సైకో!

నమ్మించి.. ముంచేస్తారు

గోదావరిలో స్నానానికి దిగి యువకుడి మృతి

మృత్యువులోనూ.. వీడని మిత్ర బంధం

సీఎంపై అనుచిత వ్యాఖ్యలు

ఇద్దరినీ ఒకే చోట సమాధి చేయండి

పట్ట పగలే బార్‌లో గొడవ

మాజీ ప్రియురాలిపై లైంగికదాడి.. హత్యాయత్నం

కాపురానికి రాలేదని భార్యను..

భార్యపై అత్యాచారానికి యత్నించిన స్నేహితున్ని..

దొడ్డబళ్లాపురలో ఉగ్ర కలకలం

చిన్నారిని చంపేసిన కుక్కలు

బాధిత బాలికకు రూ.10 లక్షల పరిహారం

వ్యాపార దిగ్గజం మీలా.. అస్తమయం 

మంగళగిరిలో రౌడీ షీటర్‌ దారుణహత్య

సామలేశ్వరి ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

ఆప్‌ ఎమ్మెల్యేకు జైలు శిక్ష విధించిన కోర్టు

ఫ్లాట్‌ నుంచి దుర్వాసన; తల్లీకొడుకుల మృతదేహాలు..

పాత వీడియోనే.. మళ్లీ వైరల్‌!

ఘోర బస్సు ప్రమాదం; ఆరుగురు మృతి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

దూసుకుపోతున్న కబీర్‌ సింగ్‌..5 రోజుల్లోనే 100 కోట్లు!

‘సైరా’ సంగీత దర్శకుడికి మెగా ఆఫర్‌

గూగుల్‌లో వారం రోజుల పాటు ఉద్యోగం చేశాను..

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘కల్కి’

మీకు అర్థం కాదా : జ్యోతిక ఫైర్‌

మేఘాకు జాక్‌పాట్‌