సూసైడ్‌ కేసులో వేధింపులు..యువకుడి బలవన్మరణం

10 Mar, 2019 09:37 IST|Sakshi
మహేష్‌ భార్యను అడిగి వివరాలు తెలుసుకుంటున్న సీఐ.. మహేష్‌ (ఫైల్‌) 

సాక్షి, లక్సెట్టిపేట(మంచిర్యాల): మండలంలోని తిమ్మాపూర్‌ గ్రామానికి చెందిన నాంపల్లి మహేష్‌(25) అనే యువకుడు గ్రామానికి చెందిన పెరుగు తిరుపతి అనే వ్యక్తి వేధింపులు భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డట్టు సీఐ శ్రీనివాస్‌ తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. రెండు నెలల కిందట బలరావుపేట గ్రామానికి చెందిన ఓ యువతి బావిలో పడి ఆత్మహత్య చేసుకుంది. ఆ యువతితో మహేష్‌కు పరిచయం ఉన్నదనీ, ఆమె ఆత్మహత్యకు నువ్వే కారణమంటూ తిరుపతి మహేష్‌ ఇంటికి వెళ్లి లక్ష రూపాయలు ఇవ్వాలనీ, లేకుంటే విషయాన్ని పోలీసులకు చెబుతాన ని బెదిరించాడన్నారు.

మహేష్‌ తన వద్ద అంత డబ్బు లేదనీ, ఆటో నడుపుతూ బతుకుతున్నానని ఎంత బతిమిలాడినా వినకుండా.. నేను ఆల్‌ ఇం డియా ఎస్సీ, ఎస్టీ ఐక్య వేదిక రాష్ట్ర కార్యదర్శినని, నీపై అట్రాసిటీ కేసు పెడతానని, సదరు యువతి చావుకు నువ్వే కారణమని ధర్నా చేస్తానని తిరుపతి మహేష్‌ను వేధించాడు. దీంతో మృతుని కుటుంబీకులు కూడా డబ్బులు లేవని, తమను తప్పుడు కేసులో ఇరికించొద్దని తిరుపతి కాళ్లు మొక్కినా వినకుండా పోలీసులకు తెలిపాడు. దీం తో పోలీసులు మహేష్‌ను పలుమార్లు పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. ఈ క్రమంలోనే శనివారం జన్నారం మండలం గొడిసెరాలలో ఉన్న ఆలయానికి మహేష్‌ కుటుం బ సభ్యులతో కలిసి వెళ్లాడు. కొద్దిసేపటికి మహేష్‌ భార్య శారద భర్త కనిపించకపోవడంతో ఫోన్‌ చేయగా, నన్ను పెరుగు తిరుపతి డబ్బుల కోసం వేధిస్తున్నాడనీ, అందుకే భయంతో పురుగుల మందు తాగానని చెప్పాడు. భార్య శారద వెంటనే ఆలయం దగ్గరికి రమ్మనగా అప్పటికే పురుగుల మందు తాగిన మహేష్‌ ఆలయానికి ఎలాగోలా వచ్చాడు.

అతని పరిస్థితి గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే జన్నారం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా, అక్కడి వైద్యుల సూచన మేరకు లక్సెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చిన కొద్దిసేపటికే మహేష్‌ ప్రాణాలు వదిలినట్లు సీఐ తెలిపారు. విషయం తెలుసుకున్న జిల్లా రజక సంఘం అధ్యక్షుడు కటుకూరి రాజన్న, నాయకులు తిరుపతి, లక్ష్మణ్, శ్రీనివాస్‌ మృతుడి కుటుం బానికి నష్టపరిహారం చెల్లించి, మృతికి కారణమై న తిరుపతిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో సీఐ చట్ట పరమైన చర్యలు తీసుకొని మృతుని కుటుంబాని కి న్యాయం చేస్తామని తెలుపడంతో వారు శాం తించారు. మృతుడి తల్లి రామవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిసారు. కాగా, మృతుడికి నాలుగు నెలల పాప కూడా ఉంది.  

మరిన్ని వార్తలు