ఫెయిల్ అవుతాననే భయంతో విద్యార్థి ఆత్మహత్య, కానీ.. | Sakshi
Sakshi News home page

ఫెయిల్ అవుతాననే భయంతో విద్యార్థి ఆత్మహత్య, కానీ..

Published Tue, May 10 2016 5:02 PM

10th class student commits suicide

విజయవాడ (కృష్ణాజిల్లా) : పదవ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అవుతానన్న భయంతో టెన్త్ విద్యార్థి ఫలితాలు రాకముందే ఆత్మహత్యకు చేసుకున్నాడు. తీరా ఫలితాలు విడుదలయ్యాక చూస్తే అతను పాసయ్యాడు. ఈ సంఘటన కృష్ణా జిల్లా గోడవర్రు గ్రామంలో మంగళవారం ఉదయం జరిగింది.

గోడవర్రు గ్రామానికి చెందిన వెలిసెల వినయ్ కుమార్ పరీక్షల్లో తప్పుతానేమోనన్న భయంతో ఫలితాలు విడుదల కాకముందే ఉదయం ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తీరా ఫలితాలు వెలుడిన తర్వాత పాసైనట్లు తెలిసింది. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

Advertisement
Advertisement