11 కేజీల గంజాయి స్వాధీనం: ఇద్దరి అరెస్ట్ | Sakshi
Sakshi News home page

11 కేజీల గంజాయి స్వాధీనం: ఇద్దరి అరెస్ట్

Published Tue, Jun 21 2016 9:13 AM

11 kg cannabis seized, two arrested

విజయనగరం: ఎస్.కోట మండలం బొడ్డవర సమీపంలో ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారులు 11 కిలోల గంజాయిని సోమవారం స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇన్‌చార్జి ఏసీ వై.చైతన్యమురళి ఆదేశాల మేరకు సాధారణ తనిఖీల్లో భాగంగా ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు బొడ్డవరలో తనిఖీలు చేపట్టగా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నిక్కు బిల్‌వారి, జిబ్రాన్‌ఖాన్ అక్రమంగా తరలిస్తున్న 11 కిలోల గంజాయి, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్ చేసి ఎస్.కోట ఎక్సైజ్ స్టేషన్‌కు తరలించారు. దాడుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ ఎంవీఎస్ లోకేశ్వరరావు ఎస్‌ఐ నాగభూషణ్, హెచ్‌సి నాగేశ్వరరావు, కానిస్టేబుళ్లు రాము, కూర్మారావు, ఫాతిమాబేగం పాల్గొన్నారు.
 
 బెల్టు దుకాణాలపై దాడులు
 బొబ్బిలి ఎక్సైజ్‌స్టేషన్ పరిధిలోని బలిజిపేట మండలం నారాయణపురంలో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు రెండు బెల్టు దుకాణాలపై సోమవారం దాడులు చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏఈఎస్ వై.భీమ్‌రెడ్డి ఆధ్వర్యంలో నారాయణపురంలో బెల్టు దుకాణాలు నిర్వహిస్తున్న గేదెల రామారావు వద్ద 22 నిబ్బులు, పకీర్ రాజు నుంచి 20 నిబ్బులు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement