దిండి రిసార్ట్ వద్ద ఆందోళన | Sakshi
Sakshi News home page

దిండి రిసార్ట్ వద్ద ఆందోళన

Published Sat, Oct 31 2015 10:25 AM

దిండి రిసార్ట్ వద్ద ఆందోళన

మలికిపురం: తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం దిండి రిసార్టుల సమీపంలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమ పంట పొలాల నుంచి పైప్లైన్ వేయొద్దంటూ రైతులు చేపట్టిన ఆందోళన రెండో రోజు కొనసాగుతోంది. దిండిలో గెయిల్ గ్యాస్ పైపులైను నిర్మాణ పనుల దృష్ట్యా శుక్రవారం నాడు విధించిన 144 సెక్షన్ శనివారం కూడా కొనసాగుతోంది. నగరం గ్యాస్ పైపులైన్ పేలుడు దుర్ఘటన తర్వాత గ్యాస్ సరఫరాలో ఆటంకం ఏర్పడింది.

ఈ నేపథ్యంలో గ్యాస్ పైపులైనును తిరిగి నిర్మించాలని కేంద్రం ఆదేశించింది. అయితే, భారీ పేలుడు దుర్ఘటన అనుభవంతో దిండిలో పైప్‌లైను నిర్మాణ పనులకు స్థానిక రైతులు అభ్యంతరం చెప్పారు. దీంతో ఐదు నెలలుగా పనులు నిలిచిపోయాయి. తాజాగా కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాలతో భారీగా పోలీసులను మోహరించి పనులను చేపట్టారు.

దీంతో ప్రముఖ పర్యాటక ప్రాంతంగా ఉన్న దిండి రిసార్టుల సమీపంలో కూడా ఆందోళన, ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. గోదావరి తీరం వెంట ఉండే ఈ రిసార్టుల వద్దకు వారాంతాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది వస్తుంటారు.

Advertisement
Advertisement