25 నుంచి విద్యార్థుల ఆత్మగౌరవ యాత్ర | Sakshi
Sakshi News home page

25 నుంచి విద్యార్థుల ఆత్మగౌరవ యాత్ర

Published Sun, Oct 23 2016 11:11 PM

25 students from the self-respect of the trip

కడప రూరల్‌ :  నవ్యాంధ్రప్రదేశ్‌లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఈనెల 25వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల ఆత్మగౌరవ యాత్రను చేపడుతున్నట్లు సీమాంధ్ర విద్యార్థి సంక్షేమ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌పీ సురేష్‌చౌదరి తెలిపారు. ఆ మేరకు ఆదివారం స్థానిక ఆ సంఘం కార్యాలయంలో కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవ్యాంధ్రప్రదేశ్‌లో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి సంబంధించి అడ్డగోలు నిర్ణయాలు తీసుకోవడం తగదని హితవు పలికారు. సంక్షేమ హాస్టళ్లను బలోపేతం చేయకుండా వాటిని మూసివేయడం దారుణమన్నారు. అలాగే నిరుద్యోగ యువతకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం శోచనీయమన్నారు. బ్రాహ్మణి స్టీల్‌ ఫ్యాక్టరీని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ప్రారంభించాలన్నారు. ప్రభుత్వ హాస్టళ్లకు పక్కా భవనాలు, ప్రహారీలు నిర్మించాలన్నారు. 25వ తేదీన బద్వేలు నుంచి ప్రారంభించే విద్యార్థుల ఆత్మగౌరవ యాత్రను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.  కార్యక్రమంలో శివకుమార్, నాగరాజు, శ్రీకాంత్, చంటి, శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement