Sakshi News home page

సరస్వతీ పుత్రికలు

Published Tue, Mar 7 2017 11:07 PM

సరస్వతీ పుత్రికలు

  • ఐదుగురు అక్కా చెల్లెళ్లు
  • ప్రభుత్వ ఉద్యోగులు
  • ముమ్మిడివరం :  
    లక్ష్యానికి పేదరికం అడ్డురాదని నిరూపించి తల్లిదండ్రుల కలలను నిజం చేశారు ఆ అక్కచెల్లెళ్లు. కష్టపడి ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించి పలువురికి ఆదర్శంగా నిలిచారు. ముమ్మిడివరం మండలం గాడిలంక గ్రామానికి చెందిన బసవా ఓం శివాజీ, కాశీఅన్నపూర్ణ దంపతులకు ఐదుగురు కుమార్తెలు. తల్లి కాశీ అన్నపూర్ణ పోలియో కారణంగా ఒక చేయి పని చేయకపోయినా మొక్కవోని ధైర్యంతో ఒంటి చేత్తో ఇంటి, వంట పనులు చేసుకుంటూ పిల్లలను బడికి పంపించారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ఓం శివాజీ తండ్రి ఇచ్చిన ఐదెకరాలు సాగు చేసుకుంటు కుటుంబాన్ని పోషిస్తున్నారు. వ్యవసాయంలో రాబడి అంతంత మాత్రంగా ఉండటంతో 
    పిల్లల చదువు ప్రభుత్వ పాఠశాలలోనే సాగిం ది. ఉన్నత చదువుల కోసం తమ గ్రామానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ముమ్మిడివరంలోని కళాశాలలకు కాలినడన వెళ్లి ఇంటర్, డిగ్రీ చదువులు పూర్తి చేశారు. ప్రథమ కుమార్తె  వెంకట నర్సమ్మ ఎంఎస్‌సీ, బీఈడీ పూర్తిచేసి ఖమ్మం జిల్లాలో ఉపవిద్యాశాఖాధికారినిగా కొంతకాలం ఇంచార్జి విద్యాశాఖాధికారినిగా పని చేశారు. రెండో కుమార్తె చందు ఎంకాం బీఈడీ పూర్తి చేసి ముమ్మిడివరం మండలం పెదమెట్టలంక పాఠశాలలో ఎస్‌జీటీగా పని చేస్తున్నారు. మూడో కుమార్తె విజయలక్ష్మి బీఎస్సీ బీఈడీ చేసి స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుని, నాలుగో కుమార్తె నాగమణి ఇంజినీరింగ్‌ పూర్తి చేసి భారత డైనమిక్సి లిమిటెడ్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌గా, ఐదో కుమార్తె లలిత స్వగ్రామంలో తన చదువుకున్న జెడ్పీ పాఠశాలలో ఉపాధ్యాయినిగా పని చేస్తున్నారు. ఆడపిల్లలు వంటింటికే పరిమితం కాకుడదనే ఉద్దేశ్యంతో మమ్మల్ని ప్రయోజకుల్ని చేయడంలో అమ్మ ప్రోత్సాహం మరువలేనిదని అంటున్నారు ఆ ఐదుగురు కుమార్తెలు.
     

Advertisement

తప్పక చదవండి

Advertisement