రూ.351కోట్లతో 60 విద్యుత్‌ సబ్‌స్టేషన్లు | Sakshi
Sakshi News home page

రూ.351కోట్లతో 60 విద్యుత్‌ సబ్‌స్టేషన్లు

Published Mon, Aug 15 2016 9:36 PM

జ్యోతిప్రజ్వలన చేసి స్వాతంత్య్రదినోత్సవ వేడుకలను ప్రారంభిస్తున్న ఎస్పీడీసీఎల్‌ సీఎండీ హెచ్‌వై దొర - Sakshi

– వినియోగదారులకు మెరుగైన సేవలే లక్ష్యం
– ఎక్కడ నుంచైనా మోటర్‌ ఆఫ్‌ చేయడం కోసం రూ.12.26 కోట్లతో ప్యానెల్స్‌
– ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ హెచ్‌వై దొర
తిరుపతి రూరల్‌:
విద్యుత్‌ వినియోగదారులకు మెరుగైన సేవలను అందించడమే లక్ష్యంగా ఎస్పీడీసీఎల్‌ పరిధిలోని ఎనిమిది జిల్లాల్లో రూ. 351కోట్లతో 60 సబ్‌స్టేషన్లను నిర్మిస్తున్నట్లు సంస్థ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ హెచ్‌వై దొర తెలిపారు. తిరుపతిలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో సోమవారం 70వ స్వాతంత్య్ర దినోత్సవ డేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐసీడీయస్, డీడీయూజీజేవై పథకాల కింద 36 ఇన్‌డోర్, 24 ఔట్‌డోర్‌ సబ్‌స్టేషన్లను నిర్మిస్తున్నామన్నారు. డీడీయూజీజేవై పథకం కింద దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేదలకు రూ.125కే నాలుగు లక్షల విద్యుత్‌ కనెక్షన్లను అందించినట్లు పేర్కొన్నారు. విద్యుత్‌ బిల్లుల చెల్లింపును మరింత సరళతరం చేసామని, కొత్త యాప్‌ ద్వారా ఎక్కడ నుంచైనా బిల్లులను చెల్లించవచ్చన్నారు. రైతులకు సౌకర్యవంతంగా సేవలు అందించేందుకు రూ.12.26 కోట్లతో 13వేల రిమోట్‌ కంట్రోల్‌ ప్యానెల్స్‌ను కొనుగోలు చేసి రైతులకు ఉచితంగా అందిస్తామన్నారు. ప్రభుత్వం నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో విద్యుత్‌శాఖ ఏర్పాటుచేసిన శకటానికి తృతీయ బహుమతి లభించడం అభినందనీయన్నారు. 
సివిల్స్‌ విజేతలకు సన్మానం..
ఇటీవల నిర్వహించిన సివిల్స్‌ ఫలితాల్లో ఉత్తమ ర్యాంకులు సాధించి ఐపీయస్, ఐఆర్‌యస్‌కు ఎంపికైన విద్యుత్‌ ఉద్యోగుల పిల్లలను సత్కరించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, వారి పిల్లలు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ఫైనాన్స్‌ డైరెక్టర్‌ బిలాల్‌ బాషా, చీఫ్‌ విజిలెన్స్‌ ఆఫీసర్‌ మనోహర్, సీజీఎంలు ఏసునాధు, హనుమత్‌ప్రసాద్, సీఈ నందకుమార్‌ పాల్గొన్నారు.
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement