విశాఖలో ఐదుగురి విదేశీయుల అరెస్ట్‌.. విచారణ | Sakshi
Sakshi News home page

విశాఖలో ఐదుగురి విదేశీయుల అరెస్ట్‌.. విచారణ

Published Wed, Jan 27 2016 9:23 PM

7 held, police checking in vizag

విశాఖ: విశాఖ జిల్లా నక్కపల్లి టోలుగేటు వద్ద బుధవారం పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో కారులో ఐదుగురు అనుమానస్పద వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారులో ఇద్దరు మహిళలు సహా ఐదుగురు విదేశీయులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు ఇరానీ దేశస్థులేనని పోలీసులు వెల్లడించారు.

వారివద్ద పాస్‌పోర్టులు కూడా ఉన్నట్టు తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులను పోలీసులు విచారిస్తున్నారు. ఇటీవల భువనేశ్వర్‌లో చోరీకి గురైన కారుగా పోలీసులు గుర్తించారు. కాగా, నక్కపల్లి టోలుగేటు వద్ద వాహనాన్ని పట్టుకున్న మాట వాస్తమేనని ఎస్పీ కోయ ప్రవీణ్‌ తెలిపారు. వారు ఎందుకు వస్తున్నారో, ఎటువైపు ప్రయాణిస్తున్నారో విచారిస్తున్నామని ఎస్పీ తెలిపారు.

Advertisement
Advertisement