రాజీ మార్గంతో శాశ్వత పరిష్కారం | Sakshi
Sakshi News home page

రాజీ మార్గంతో శాశ్వత పరిష్కారం

Published Sun, Sep 11 2016 12:59 AM

రాజీ మార్గంతో శాశ్వత పరిష్కారం

 
  •  జిల్లా ప్రధాన న్యాయమూర్తి మౌలానా జునైద్‌ అహ్మద్‌
నెల్లూరు(లీగల్‌) :
కక్షిదారులు కేసులను రాజీ చేసుకోవడం ద్వారా శాశ్వత పరిష్కారం జరుగుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌ మౌలానా జునైద్‌ అహ్మద్‌ పేర్కొన్నారు. శనివారం జిలా ్లకోర్టు ప్రాంగణంలోని న్యాయసేవాసదన్‌ భవనంలో జాతీయ లోక్‌అదాలత్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసుల సత్వర పరిష్కారానికి లోక్‌అదాలత్‌ దోహదపడుతుందని, కక్షిదారులకు సమయంతో ఖర్చు తగ్గుతుందన్నారు.  
926 కేసుల పరిష్కారం
జాతీయ లోక్‌అదాలత్‌ సందర్భంగా జిల్లా కోర్టు ఆవరణలో 7 బెంచీలను ఏర్పాటు చేశారు. అదనపు జిల్లా జడ్జిలు పాపిరెడ్డి, శ్రీరామచంద్రమూర్తి, న్యాయసేవాధికారసంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి సత్యవాణి, మొదటి అదనపు సీనియర్‌ సివిల్‌జడ్జి భూపాల్‌రెడ్డి, జూనియర్‌ సివిల్‌ జడ్జిలు శోభారాణి, కేశవ, వాసుదేవన్‌లు ప్రిసైడింగ్‌ అధికారులుగా వ్యవహరించి 926 కేసులను పరిష్కరించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ కోర్టుల్లో నిర్వహించిన జాతీయ లోక్‌అదాలత్‌లో 490 కేసులను పరిష్కరించారు. మోటారు ప్రమాద కేసులలోని పిటీషనర్లుకు పరిహారంగా రూ.2,5,62,715లు చెల్లించారు. ఈ కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి శ్యామలాదేవి, ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి సుబ్బారావు, జూనియర్‌ సివిల్‌ జడ్జిలు హేమలత, పద్మ, అరుణశ్రీ, పద్మశ్రీ, బ్యాంక్అధికారులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement