అమ్మాయిలపై దాడులు అరికట్టాలి | Sakshi
Sakshi News home page

అమ్మాయిలపై దాడులు అరికట్టాలి

Published Sat, Aug 20 2016 7:19 PM

ఏబీవీపీ నాయకులకు రాఖీలు కడుతున్న విద్యార్థులు

సదాశివపేట: నీకు నేను రక్ష- నాకు  నీవు రక్ష, మనం అందరం కలిసి దేశానికి ధర్మానికి, సంస్కృతికి రక్ష అని ఏబీవీపీ ఎస్‌ఎఫ్‌డీ జిల్లా కన్వీనర్‌ మహేశ్‌స్వామి పేర్కొన్నారు. ఏబీవీపీ పట్టణశాఖ అధ్వర్యంలో శనివారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రక్ష బంధన్‌ నిర్వహించారు.

కళాశాల విద్యార్థినీ విద్యార్థులు ఏబీవీపీ నాయకులకు రాఖీలు కట్టి రక్ష బంధన్‌ నిర్వహించారు. అనంతరం కళాశాల విద్యార్థినీ విద్యార్థులు  ఒకరినోకరులు రాఖీలు కట్టుకుని అనందించారు. ఈ సందర్భంగా రాఖీ పౌర్ణమి  ప్రత్యేకతను మహేశ్‌స్వామి విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో అధ్యాపకులు జగదీశ్వర్‌, లచ్చయ్య, పవన్‌కుమార్‌, విద్యాసాగర్‌ పాల్గొన్నారు.

ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో..
పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో స్‌ఎఫ్‌ఐ అధ్వర్యంలో ఘనంగా రక్షాబంధన్‌ నిర్వహించారు.  వైస్‌ ప్రిన్సిపాల్‌ దస్తగిరికి విద్యార్థులు రాఖీలు  శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్‌ అధ్యక్షుడు శ్రీకాంత్‌, కళాశాల కమిటీ నాయకులు నవీన్‌, నర్సింలుకు విద్యార్థులు రాఖీలు కట్టి రక్షాబంధన్‌ శుభాకాంక్షలు తెలిపారు.శ్రీకాంత్‌ మాట్లాడుతూ విద్యార్థుల్లో ఐక్యత, స్నేహభావాలను పెంపొందించడం కోసం తాము నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు.

కులమత బేధం లేకుండా అందరు సంతోషంగా జరుపుకునే పండుగ రక్షాబంధన్‌ అని తెలిపారు.  రక్షాబంధన్‌ స్ఫూర్తితో  అమ్మాయిలపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం ఆరికట్టాలని,  ఎస్‌ఎఫ్‌ఐ కళాశాల కమిటీలు వారికి రక్షణగా పనిచేయాలన్నారు.   కార్యక్రమంలో కళాశాల వైస్‌ ప్రిన్సిపల్‌ దస్తగిరి, కళాశాల కమిటీ నాయకులు కళావతి, ముబిన, నవీన్‌, శ్రీను, నర్సింలు,  శ్యామలా, మాధవి,మౌనిక తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement