సర్వశిక్షాఅభియాన్‌ కార్యాలయం వద్ద ధర్నా | Sakshi
Sakshi News home page

సర్వశిక్షాఅభియాన్‌ కార్యాలయం వద్ద ధర్నా

Published Sat, Jul 23 2016 6:24 PM

సర్వశిక్షాఅభియాన్‌ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న తొలగించిన ఉద్యోగులు.

 -నోటిఫికేషన్‌ను రద్దు చేయాలి
– సర్వశిక్షాఅభియాన్‌ ఉద్యోగులను విధులలోకి తీసుకోవాలి
– న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం 
 
– పాల్గొన్న సీఐటీయూ, తొలగింపబడ్డ ఉద్యోగులు 
చిత్తూరు(ఎడ్యుకేషన్‌): బాబు వస్తే జాబు రాలేదు కానీ .... ఊడిపోతోందని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చైతన్య, తొలగించిన ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు శనివారం ఎస్‌ఎస్‌ఏ జిల్లా కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కొత్తవారిని చేర్పించుకునేందుకు జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. సర్వశిక్షా అభియాన్‌లో చాలా కాలంగా పనిచేస్తున్న తమను పనితీరు ప్రామాణికత పేరుతో తొలగించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్న ఫలంగా తమను తొలగిస్తే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది కొత్త విధానాలను అమలు చేసు తమ కడుపులు కొట్టడం అన్యాయమన్నారు. తమ స్థానంలో కొత్త వారిని నియమించుకోవడానికి  నోటిఫికేషన్‌ జారీ చేయడం దారుణమన్నారు. తమ ఉద్యోగాలు తమకు కేటాయించాలని, లేని పక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఏ ఇతర జిల్లాలో లేని విధంగా ఈ జిల్లాలో మాత్రం సొంత నిర్ణయాలు తీసుకుని తమకు అన్యాయం చేస్తున్నార న్నారు.  సీఎం సొంత జిల్లాలో పనిచేస్తున్న తమకు అన్యాయం జరిగిందని. అయినా తమ బాధను  పట్టించుకునే నాధుడే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ఇతర  శాఖలో పనిచేసే ఉద్యోగులపై చూపని పనితీరు ప్రామాణికత తమకు మాత్రమే ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. చిరుద్యోగాలను చేసుకుంటున్న తమపై అధికార ప్రతాపం చూపి తమ భవిష్యత్తును అందకారంలోకి నెట్టడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. ఎన్నికల సమయంలో అధికార పార్టీ నాయకులు నిరుద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలకు విరుద్ధంగా పాలన జరుగుతోందన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని ప్రచారం చేసిన ప్రజాప్రతినిధులు తమ ఉద్యోగాలను ఊడగొడుతుంటే ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.  
 మాపై కక్ష .... వారిపై ప్రేమ ఎందుకో  ?
  కుప్పం పరిధిలో చాలా క్వారీలు అనుమతులు లేకుండా నడుస్తున్నాయి. ఆ శాఖలో నిర్లక్ష వైఖరి ను చూపుతున్న అధికారులకు పనితీరు ప్రామాణికత లేదా?.  ఇటీవల జిల్లా పర్యటన చేసిన కేంద్ర కమిటీ రాష్ట్రంలో కల్లా చిత్తూరు లో శిశు మరణాల రేటు 33 శాతం వర కు ఉందని రుజువు చేశారు.. ఆ శాఖ పై దృష్టి లేదు. ఆ సిబ్బందికి ప్రామాణికత లేదు ఎందుకని?. ప్రజలు తమ సమస్యలను పరిష్కరించమని రెవెన్యు శాఖ చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు ... నియమ నిబంధనల ప్రకారం పనిచేయని ఆ శాఖ సిబ్బందిపై చూపు లేదా?. న్యాయం జరిగేంతవరకు పోరాటం చేస్తాం 
– చైతన్య, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు 
పోరాటం చేస్తాం
తొలగించిన సర్వశిక్షా అభియాన్‌ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకునేంత వరకు సీఐటీయూ తరఫున పోరాటం చేస్తాం. ఇతర జిల్లాలో లేని విధంగా ఈ జిల్లాలో మాత్రం సొంత నిర్ణయాలు తీసుకుని చిరుద్యోగులకు బాధ్యులను చేయడం అన్యాయం. ఉన్న వారిని తొలగించి కొత్త  వారిని తీసుకునేందుకు నోటిఫికేషన్‌ జారీ చేయడం ఎంతవరకు న్యాయం. ఇతర శాఖలలో పనితీరు ప్రామాణికతను ప్రవేశపెట్టని కలెక్టర్‌‡ సర్వశిక్షాఅభియాన్‌లో పని చేసే ఉద్యోగులకు మాత్రం ఎందుకు ఆ ప్రమాణాలు పెట్టినట్లు.  ఉన్న ఫళంగా తొలగిస్తే ఎక్కడ పనిచే యాలి – సావిత్రి – తొలిగించిన ఉద్యోగి. కేవీబీ పురం
మా గతి ఏమిటి?
 ఉన్న ఫళంగా మా ఉద్యోగాలను తొలగిస్తే మా పరిస్థితి ఏమిటి?. మేము ఎక్కడ పనిచేయాలి. విద్యా వ్యవస్థనే నమ్ముకుని ఉద్యోగం చేసుకుంటు జీవనం సాగిస్తున్న మాకు ఇలాంటి శిక్షలు ఎందుకు వేస్తున్నారు. మాకు ఎటువంటి సమాచారం లేకుండా మా ఉద్యోగాలను తొలగిస్తున్నామని చెప్పడం చాలా దారుణం. మాకు న్యాయం జరిగేంత వర కు పోరాటం చేస్తాం. నిబంధనలను పాటించడం లేదు – వెంకటరమణ –తొలగించిన సీఆర్‌పీ బి.కొత్తకోట 
 
 
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement