ఉద్యానసాగుకు ఊతం | Sakshi
Sakshi News home page

ఉద్యానసాగుకు ఊతం

Published Wed, Jan 25 2017 11:01 PM

ఉద్యానసాగుకు ఊతం - Sakshi

– రాయితీతో రైతులకు సరికొత్త పథకాలు అమలు
– ఉద్యానశాఖ డీడీ సుబ్బరాయుడు, ఏడీ సత్యనారాయణ


అనంతపురం అగ్రికల్చర్‌ : ఉద్యానతోటల సాగులో మరింత మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం, అత్యాధునిక యాజమాన్య పద్ధతులు అందుబాటులోకి తెస్తున్నట్లు ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ బీఎస్‌ సుబ్బరాయుడు, ఏడీ సీహెచ్‌ సత్యనారాయణ, ఇంజనీరు శృతి తెలిపారు. కొత్తగా అమలులోకి తెస్తున్న రాయితీ పథకాలను రైతులు, వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

పథకాలు వినియోగించుకోవాలి : రైతులు పండించిన పంట ఉత్పత్తులకు సరైన ధర లేని సమయంలో నిల్వ చేసుకునేందుకు, పంట నాణ్యత పెంచడం, ప్రాసెసింగ్‌ చేయడానికి, కోత అనంతరం జాగ్రత్తలు, బ్రైప్రొడక్ట్స్‌గా మార్చుకునేందుకు ఉద్యాన రైతులను ప్రోత్సహిస్తాం. ఇప్పటివరకు పంటల విస్తీర్ణం పెంపుపై దృష్టి సారించాం. ఈ క్రమంలో రైతు ఉత్పత్తిదారుల కంపెనీలు (ఎఫ్‌పీఓ) ఏర్పాటు చేశాం. వారి చెంతకు మరింత సాంకేతిక పరిజ్ఞానం అందించి ఊతమివ్వడానికి కొత్త పథకాలు అమలు చేస్తున్నాం. ఉద్యానశాఖ అధికారులను సంప్రదించి రాయితీ పథకాలు వినియోగించుకోవాలి.
 
కొత్తగా అమలు చేస్తున్న పథకాలు
+ తక్కువఖర్చుతో 25 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం కలిగిన ఉల్లి నిల్వ కేంద్రం నిర్మాణానికి మొత్తం రూ.1.75 లక్షలు ఖర్చు అవుతుండగా అందులో ప్రభుత్వం రూ.87,500 రాయితీ వర్తిస్తుంది. మిగతాది లబ్ధిదారులు భరించాలి.
+ జీరో ఎనర్జీ కోల్డ్‌ ఛాంబర్‌కు రూ.4 వేలు అవుతుండగా అందులో రూ.2 వేలు రాయితీ వర్తిస్తుంది.
+ కోల్ట్‌స్టోరేజీ నిర్మాణానికి సంబంధించి ఒక మెట్రిక్‌ టన్ను సామర్థ్యానికి పూర్తీ విలువ రూ.8 వేలు చొప్పున గరిష్టంగా 5 వేల మెట్రిక్‌ టన్నుల నిర్మాణం చేసుకోవచ్చు. దీనికి 35 శాతం రాయితీ వర్తింపు. గరిష్టంగా రూ.1.40 కోట్లు వరకు రాయితీ వర్తిస్తుంది.
+ రూ.50 లక్షలు విలువ చేసే ఇంటిగ్రేటెడ్‌ ప్యాక్‌హౌస్‌కు రూ.17.50 లక్షలు రాయితీ వర్తింపు.
+ రూ.25 లక్షలు విలువ చేసే ఫ్రీకూలింగ్‌ యూనిట్‌కు రూ.8.75 లక్షలు రాయితీ వర్తింపు.
+ రూ.15 లక్షలు విలువ చేసే కోల్ట్‌రూం నిర్మాణానికి రూ.5.25 లక్షలు రాయితీ వర్తిస్తుంది.
+ రూ.25 లక్షలు విలువ చేసే రిఫ్రిజిరేటెడ్‌ ట్రాన్స్‌పోర్టు వెహికల్‌పై రూ.10 లక్షలు రాయితీ వర్తిస్తుంది.
+ టమాట కిచెచ్‌ ప్లాంట్, గార్లిక్, ఆనియన్‌ డీహైడ్రేషన్‌ ప్లాంట్, రెడ్‌చిల్లీడ్రైయర్, బొప్పాయి ఫ్రూట్‌ ప్రాసెసింగ్‌ ప్లాంట్, ఫైనాఫిల్‌ జ్యూస్‌ ప్లాంట్‌ తదితర ప్రైమరీ, మొబైల్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లకు సంబంధించి రూ.25 లక్షల విలువ చేసే యూనిట్‌పై రూ.10 లక్షలు రాయితీ వర్తిస్తుంది.
+ రూ.ఒక లక్ష విలువ చేసే రైపనింగ్‌ ఛాంబర్‌కు 35 శాతం రాయితీ వర్తింపు.
+ మరిన్ని వివరాలకు డీడీహెచ్‌–79950 86792, ఏడీహెచ్‌–79950 86790, ఇంజనీరు–79950 87056 నెంబర్లలో సంప్రదించాలి. 

Advertisement
Advertisement