Sakshi News home page

అంతన్నారింతన్నారు..!

Published Mon, Jul 4 2016 8:21 AM

అంతన్నారింతన్నారు..! - Sakshi

నేడు అల్లూరి జయంతి 

అల్లూరి స్మారక చిహ్నాల అభివృద్ధికి
రూ.2 కోట్లిస్తామని అయ్యన్న హామీ కేటాయింపు రూ. లక్షల్లో
అభివృద్ధి ప్రచారానికే పరిమితం 
నేడు అల్లూరి పార్కులో వేడుకలు

 
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్మారక చిహ్నాల అభివృద్ధికి నేతల హామీలు పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. టీడీపీ ప్రభుత్వం రెండేళ్ల పాలనలో రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు పలు సందర్భాల్లో ఇచ్చిన హామీల పరిస్థితి అదేవిధంగా ఉంది. వీటిలో కొన్ని మాత్రమే అమలుకు నోచుకోగా అత్యధికం ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. రూ. 2 కోట్లు కేటాయించామని చెబుతున్న నేతలు వాటిని ఎందుకు ఖర్చు చేయలేదో చెప్పాల్సిన అవసరం ఉంది.
 

గొలుగొండ:  కేడీపేట అల్లూరి పార్కు అభివృద్ధి పనులు అంతంతమాత్రంగానే జరుగుతున్నాయి. గతేడాది పర్యాటకశాఖ నుంచి పార్కు అభివృద్ధికి రూ.20 లక్షల వరకు మంజూరు అయ్యాయి. వాటితోనే విద్యుత్ దీపాలంకరణ, పర్యాటకుల విశ్రాంతికోసం చిన్న కాటేజీలు, రెస్టారెంట్, గ్రంథాలయ భవనం ఏర్పాటయ్యాయి. అంతకుమించి చేపట్టిన పనులేమీ లేవని పర్యాటకులు విమర్శిస్తున్నారు.
 మంత్రి అయ్యన్నపాత్రుడు పలు సందర్భాల్లో ఇచ్చిన హామీలు. వీటిని జులై నాలుగులోగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


అల్లూరి పార్కులో సుమారు 12 అడుగుల అల్లూరి విగ్రహం ఏర్పాటు  పర్యాటకులకోసం మ్యూజియం కేడీపేట అల్లూరి పార్కు నుంచి గాది గూం జలపాతం మీదుగా లంబసింగి వరకు పర్యాటకంగా అభివృద్ధి పర్యాటకులకు పూర్తిగా తాగునీరు సౌకర్యం  పర్యాటకులకోసం రెస్టారెంట్పార్కు పూర్తిస్థాయిలో అభివృద్ధి (పచ్చదనం)  జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం  
 
 ఇప్పటివరకు  చేపట్టిన పనులుపార్కులో ఎండ ప్రభావానికి చనిపోయిన మొక్కల స్థానంలో కొత్తవి నాటడంపాత భవనాలకు సున్న, పెయింటింగ్పార్కు చుట్టూ పెరిగిన తుప్పల తొలగింపుపార్కులో శానిటేషన్ మెరుగు ఠపాడైన లైట్లకు మరమ్మతులు తాగునీరు అందేలా పైపులైన్లకు మరమ్మతులు ఇలా చిన్న పనులు మినహా ప్రధాన హామీలు అమలుకు నోచుకోలేదు. రెండేళ్లుగా అయ్యన్న ఇస్తున్న హామీలు ప్రకటనలకే పరిమితం అయ్యాయి. ఈ నేపథ్యంలో అల్లూరి పార్కులో సోమవారం నిర్వహించే వేడుకల్లో పాల్గొనే ఆయన ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.
 
 ప్రధాన కేంద్రాల్లో అల్లూరి విగ్రహాలు ఏర్పాటు చేయాలిఆదివాసీ గిరిజన ఐక్యవేదిక ఉత్తరాంధ్ర  ప్రధాన కార్యదర్శి గడుతూరు రాంగోపాల్ డిమాండ్ డుంబ్రిగుడ:  అల్లూరి జయంతి వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలని  ఆదివాసీ ఐక్యవేదిక ఉత్తరాంధ్ర  ప్రధాన కార్యదర్శి గడుతూరు రాంగోపాల్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని విశాఖపట్నం, పాడేరు కేంద్రాల్లో అల్లూరి విగ్రహాలతోపాటు అనుచరులు గంటందొర, బోనంగి పండుపడాల్, మల్లుదొర్ర విగ్రహాలను ఏర్పాటుచేయాలని కోరారు. దీనిపై గతంలో కలెక్టర్ యువరాజ్, వుడా వీసీ బాబూరావునాయుడుకు వినతిపత్రాలు అందజేశామని గుర్తుచేశారు. ఇప్పటికైనా వారు ఈ దిశగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
 
 

Advertisement

What’s your opinion

Advertisement