Sakshi News home page

పనిలేక జర్నలిస్టులపై కేసులు పెట్టామా?

Published Thu, Mar 24 2016 4:15 PM

పనిలేక జర్నలిస్టులపై కేసులు పెట్టామా? - Sakshi

కడప: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భూములపై వార్తలు రాసిన జర్నలిస్టులపై తప్పు లేకుండా కేసులు ఎందుకు పెడతామని డీజీపీ జేవీ రాముడు ప్రశ్నించారు. గురువారం ఆయన వైఎస్ఆర్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ 'మాకేమన్నా కేసులు లేక జర్నలిస్టులపై కేసులు పెట్టామా?. సమాజంలో ఒక హోదా ఉన్న వ్యక్తులపై నిరాధారమైన వార్తలు రాయకూడదు.

 

వార్తలు రాసిన వారే నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉంది. జర్నలిస్టులది తప్పుందా? లేదా అనేది విచారణ జరుపుతున్నామని' అన్నారు. కాగా ‘సాక్షి’ దినపత్రిక జర్నలిస్టులను విచారణ పేరిట పోలీసుస్టేషన్‌కు పిలిచి ‘రాజధాని దురాక్రమణ’ వార్తలకు మూలాలు(సోర్స్) ఏమిటో చెప్పాలని పోలీసు అధికారులు ప్రశ్నించడాన్ని భారత ప్రెస్ కౌన్సిల్(పీసీఐ) తీవ్రంగా ఆక్షేపించిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement