శాశ్వత పరిష్కారమేదీ? | Sakshi
Sakshi News home page

శాశ్వత పరిష్కారమేదీ?

Published Thu, Aug 18 2016 12:03 AM

andra fisher men  wanted to solve problems facing from tamil fisher men

 
జిల్లాలోని తీర ప్రాంతాల్లోకి తరచూ తమిళనాడుకు చెందిన జాలర్లు చొరబడి ఇక్కడి మత్స్య సంపదను కొల్ల గొడుతున్నారు.  వీరిని అడ్డుకునేందుకు ప్రయత్ని స్తున్న స్థానిక మత్స్యకారులపై దాడులు నిర్వహి స్తున్నారు. ఒక్కోసారి స్థానిక మత్స్యకారులను కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లి బంధిస్తున్నారు. పలు సందర్భాల్లో ఇరు రాష్ట్రాల అధికారులు తాత్కాలికంగా సమస్యను పరిష్కరిస్తున్నారు. అయితే పరిస్థితి పునరావృతమవుతంది. ఈ   సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని మత్స్యకారులు కోరుతున్నారు.
 
విడవలూరు:  20 ఏళ్లుగా తడ, సూళ్లూరుపేట, వాకాడు, గూడూరు, ముత్తుకూరు, ఇందుకూరుపేట, విడవలూరు, అల్లూరు, బోగోలు, కావలి పాంత్రాల సముద్ర తీరంలోకి తమిళ జాలర్లు చొచ్చుకుని వస్తున్నారు. ఈ క్రమంలో వారి ఆగడాలు ఇటీవల తారాస్థాయికి చేరుకున్నాయి. విడవలూరు మండలంలోని ఆంజనేయపురం గ్రామానికి చెందిన 18 మంది మత్స్యకారులపై సోమవారం దాడి చేయడమే కాకుండా కిడ్నాప్‌ చేశారు. తరచూ మన జిల్లా సరిహద్దు తీర ప్రాం తాలైన తడ, సూళ్లూరుపేట మండల ప్రాంతాల్లోని తీర ప్రాంతంతోపాటు పులికాట్‌లో  మత్స్య సంపదను కొల్లగొడుతుంటారు. సముద్రంలో వేట విరామ అనంతరం ఎక్కువగా తమిళ మత్స్యకారులు మన తీరంలోకి వస్తుంటారు. వారి ప్రాంతంలో కన్నా మన తీర ప్రాంతంలో మత్స్య సంపద ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. ఆంధ్రా మత్స్యకారులు  సముద్రంలో భారీ వలలు (ఐలా వలలు)ను ఏర్పాటు చేసుకున్న విషయాన్ని గమనించే తమిళ మత్స్యకారులు జూలై, ఆగస్టు నెలల్లో ఎక్కువగా మన తీరంలోకి చొచ్చుకొస్తారు. రాత్రి వేళ్లలో వచ్చి, సముద్రంలో ఆంధ్రా మత్స్యకారులు ఏర్పాటు చేసిన వలలను తెంచి వాటిలోని మత్స్య సంపదను తీసుకెళ్లడం జరుగుతోంది. 
 
గతంలోనూ వివాదాలు
సరిహద్దు విషయంలో తమిళ జాలర్లకు, సూళ్లూరుపేట, తడ మండలాల మత్స్యకారులకు గతంలో కూడా వివాదాలు జరిగాయి. అలాగే గతంలో కావలి ప్రాంతంలో ఆంధ్రా మత్స్యకారులు సముద్రంలో ఏర్పాటు చేసుకున్న వలలను ధ్వంసం చేసి వాటిల్లోని చేపలను తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. తమిళ జాలర్లను ఆంధ్రా మత్స్యకారులు అడ్డుకుని సంబంధి త శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. విడవలూరు తీరం వెంబడిలో నూ అదే పరిస్థితి. అయితే ఈ సారి తమిళ జాలర్ల సంఖ్య ఎక్కువగా ఉం డటంతో ఆంధ్రా మత్స్యకారులను బంధించి వారి వెంట తీసుకువెళ్లారు.
పరిష్కారం చూపాలి–తిరుపతి, మత్స్యకారుడు
ఏటా తమిళ జాలర్ల కారణంగా ఆంధ్రా మత్స్యకారులు నష్టపోతున్నారు. మన మత్స్య సంపదను వారు కొల్లగొడుతున్నారు. దీంతో మేము తీవ్ర నష్టాలను చూస్తున్నాం. తమిళ జాలర్ల ఆగడాలను భరించలేకపోతున్నాం. తాజాగా వారు మరింత రెచ్చిపోయి మన మత్స్యకారులను బందీలుగా ఉంచుకున్నారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చేయాలి.
 
పరిష్కారానికి చర్యలు–తిరుమలేశ్వరరెడ్డి, రూరల్‌ డీఎస్పీ 
ఆంధ్రా మత్స్యకారులు, తమిళ జాలర్లకు గత కొంత కాలంగా జరుగుతున్న వివాదాన్ని పరిష్కారించేందు కు ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులు ప్రత్యేక చర్య లు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా ఈ నెల 27వ తేదీన ఎస్పీ విశాల్‌గున్నీ ఇరు రాష్ట్రాల మత్స్యకార సంఘ నాయకులు, అధికారులతో సమావేశాన్ని నిర్వహించనున్నారు.

Advertisement
Advertisement