Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

కార్పొరేట్

Business Corporate

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

YSRCP Navaratnalu Plus Manifesto More security for middle class
మధ్య తరగతికి మరింత భరోసా.. వైఎస్సార్‌సీపీ నవరత్నాలు ప్లస్‌ మేనిఫెస్టో

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మధ్యతరగతి వర్గాల సంక్షేమానికి పలు చర్యలు చేపట్టి, ఆ వర్గాలను ఉన్నత స్థితికి తెస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ‘నవరత్నాలు ప్లస్‌’తో కూడిన మేనిఫెస్టోతో మరోసారి సంపూర్ణ భరోసా కల్పించారు. పట్టణాల్లోని మధ్య తరగతి కుటుంబాల దశాబ్దాల సొంతింటి కలను సాకారం చేసేలా కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. 123 పట్టణ స్థానిక సంస్థల్లో ప్రత్యేకంగా ఎంఐజీ లేఅవుట్లను అభివృద్ధి చేసి, సరసమైన ధరలకే ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నారు. ఇందుకోసం వచ్చే ఐదేళ్లలో ప్రతి ఏటా రూ.వెయ్యి కోట్లు కేటాయించి.. రూ.2 వేల కోట్లతో కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటుకు నిర్ణయించారు. 17 కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలు, 29 నగర పంచాయతీల్లో దశలవారీగా ఎంఐజీ లేఅవుట్లను అభివృద్ధి చేయనున్నారు. ఇదే కాకుండా, మధ్యతరగతి ప్రజల అభ్యున్నతికి పలు కార్యక్రమాలు చేపట్టారు. అవి..– ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు విదేశాల్లో చదువుకునేందుకు అండగా నిలవనున్నారు. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకానికి ఎంపిక కాని ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల ఉన్నత చదువుల కోసం తీసుకునే రుణంలో రూ.10 లక్షల వరకు పూర్తి వడ్డీని కోర్సు పూర్తయ్యేంత వరకు చెల్లించనున్నారు. గరిష్టంగా ఐదేళ్ల పాటు వడ్డీ చెల్లింపుతో ఆర్థిక భరోసానిచ్చారు. – ప్రభుత్వ పాలనలో భాగస్వాములుగా ఉంటూ ఆప్కాస్, అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల కుటుంబాలకు విద్య, వైద్యం, ఇళ్ల స్థలాలు సహా పూర్తి నవరత్న పథకాలను వర్తింజేయనున్నారు. దీనివల్ల రూ.25 వేల వరకు జీతం పొందుతున్న ఈ తరహా ఉద్యోగులందరికీ ఎంతో మేలు జరగనుంది. వీరితో పాటు ఇళ్లు లేని ప్రభుత్వ ఉద్యోగులకు వారి సొంత జిల్లాల్లోనే ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నారు. ఆ స్థలం ఖరీదులో ప్రభుత్వం 60 శాతం ఖర్చును భరించనుంది.– వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ ద్వారా మధ్యతరగతికి ఆరోగ్య రక్షణ కల్పిస్తున్నారు. రూ.5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చారు. వీరికి రూ.25 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందించనున్నారు.– వైఎస్సార్‌ కాపు నేస్తం, ఈబీసీ నేస్తం ద్వారా గతంలో మాదిరిగానే ఏటా రూ.15 వేలు అందిస్తూ వచ్చే ఐదేళ్లలో నాలుగు విడతల్లో రూ.60 వేల ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య వయస్కులైన అక్కచెల్లెమ్మల ఖాతాల్లో క్రమం తప్పకుండా ఈ ఆర్థిక సాయం జమ చేస్తారు.ఆర్యవైశ్యులకు అండగా..ఇప్పటికే ఓసీల సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు నిధులను సైతం ఇస్తున్నారు తొలిసారిగా ఆర్య వైశ్యులకు ఒక కార్పొరేషన్‌ను తీసుకొచ్చి అండగా నిలిచారు. ఆర్యవైశ్య సత్రాలను సొంతంగా వారే నిర్వహించే హక్కులను కల్పించారు. ఇంతటి సంక్షేమాన్ని వచ్చే ఐదేళ్ల పాటు కొనసాగిస్తామంటూ 2024 మేనిఫెస్టో ద్వారా మరోసారి భరోసా ఇచ్చారు.చెప్పినదానికంటే మిన్నగా..ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు సామాజికవర్గాలకు మాత్రమే కాకుండా ఇతర వర్గాలకు సైతం నవరత్నాలు పథకాలతో డీబీటీ, నాన్‌ డీబీటీ ద్వారా ఆర్థిక లబ్ధిని పెద్ద ఎత్తున అందించడం ద్వారా సీఎం వైఎస్‌ జగన్‌ రికార్డు సృష్టించారు. రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాల  అక్కచెల్లెమ్మలను సంక్షేమ పథకాలతో ఆర్థికంగా బలోపేతం చేశారు. ఈ ఐదేళ్లలో ఆయా వర్గాలకు డీబీటీ ద్వారా 1,66,45,078 మందికి రూ.43,132.75 కోట్లు, నాన్‌ డీబీటీ ద్వారా 2,00,59,280 మందికి రూ.86,969.93 కోట్లు కలిపి మొత్తం 3,67,04,358 మందికి రూ.1,30,102.68 కోట్లు లబ్ధి చేకూర్చడం విశేషం.కాపుల అభివృద్ధికి..కాపుల సంక్షేమానికి గత మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను సీఎం జగన్‌ నూరు శాతం అమలు చేశారు. మేనిఫేస్టోలో చెప్పినదానికి మించి భారీ ఆర్థిక సాయం అందించారు. ఏడాదికి రూ.2 వేలు చొప్పున ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు సాయం చేస్తామని చెప్పగా.. ఐదేళ్లలో డీబీటీ, నాన్‌ డీబీటీ కలిపి మొత్తంగా రూ.34,005.12 కోట్లు సాయమందించడం విశేషం. ఇందులో డీబీటీ ద్వారానే 65,34,600 ప్రయోజనాల కింద కాపులకు రూ.26,232.84 కోట్లు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. నాన్‌ డీబీటీ కింద మరో రూ.7,772.19 కోట్లు ప్రయోజనాలను కల్పించారు. వాస్తవానికి చంద్రబాబు ఐదేళ్ల పాలనలో కాపుల సంక్షేమానికి కేటాయించింది కేవలం రూ.1,340 కోట్లే.  

AP Politics And Election Live Updates May 2nd
AP Election Updates May 2nd: ఏపీ ఎన్నికల అప్‌డేట్స్‌

Andhra Pradesh Election Updates 2nd May..టీడీపీ మేనిఫెసో ఒక అబద్ధం: కైలే అనిల్‌ కుమార్‌11:30 AM, May 2nd, 2024పామర్రు నియోజకవర్గం నిడుమోలులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే అభ్యర్ధి కైలే అనిల్ కుమార్అడుగడుగునా కైలేకు ఘనస్వాగతం పలుకుతున్న ప్రజలుకైలే అనిల్ కుమార్ కామెంట్స్‌..ప్రజలంతా సీఎం జగన్‌ పాలనే మళ్లీ కావాలనుకుంటున్నారుఎంతమంది కలిసి వచ్చినా ముఖ్యమంత్రి జగన్‌ను ఏమీ చేయలేరని ప్రజలు విశ్వసిస్తున్నారుటీడీపీ మేనిఫెసో ఒక అబద్ధంజగన్ మోనిఫెస్టో నమ్మకంతో కూడిన ఒక నిజంఅబద్ధం, మోసంతో ఏదోరకంగా అధికారంలోకి రావాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడుచంద్రబాబుపై బీజేపీకే నమ్మకం లేదుకలిసి ప్రయాణం చేస్తున్న బీజేపీనే నమ్మకపోతే.. ప్రజలు ఎలా నమ్ముతారుపామర్రులో నూటికి 99% శాతం ప్రజలకిచ్చిన వాగ్ధానాలు నెరవేర్చాంమరో అవకాశం ఇస్తే మరింతగా పామర్రు ప్రజలకు సేవచేస్తాపామర్రులో నేను.. మచిలీపట్నం ఎంపీగా సింహాద్రి చంద్రశేఖర్ అత్యధిక మెజార్టీతో గెలుస్తాం ‘జగన్‌ కోసం సిద్ధం’11:00 AM, May 2nd, 2024మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వైఎస్సార్‌సీపీ"జగన్ కోసం సిద్ధం" పేరుతో మరో ప్రచార కార్యక్రమంనేడు ప్రారంభించనున్న పార్టీ నేతలుమేనిఫెస్టోని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం  సిద్ధంపార్టీ స్టార్ క్యాంపెయినర్లతో కలిసి ఇంటిఇంటికీ మేనిఫెస్టో టీడీపీ నేతలకు దేవినేని అవినాష్ కౌంటర్‌10:00 AM, May 2nd, 202412వ డివిజన్‌ను 13 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసాముస్థానిక టీడీపీ ఎంఎల్ఏ ఇంటి ముందు రోడ్ కూడా జగన్ ప్రభుత్వమే వేసిందిడివిజన్‌లో 20 కోట్లతో  సంక్షేమం చేసాముప్రతీ గడపలో సీఎం జగన్‌కే మా ఓటు అని చెబుతున్నారుజగన్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే అడ్డుకోవటానికి సిగ్గులేదా?స్వప్రయోజనాలు తప్ప ప్రజా సమస్యలు గద్దెకి పట్టవుతూర్పు నియోజకవర్గం ఏమైనా మీ జాగీరా?.ఓటమి భయంతోనే దిగజారుడు రాజకీయాల చేయడం టీడీపీ నేతలకే దక్కిందిరెండుసార్లు ఎంఎల్ఏ ఒకసారి ఎంపీ అనుభవం అంటే ఇదేనా?రానున్న ఎన్నికలే గద్దెకు ఆఖరి ఎన్నికలుకాలనీల అభివృద్ధికి స్థానిక ప్రజల కాంట్రిబ్యూషన్ అడిగింది వాస్తవం కాదాప్రజానీకానికి మంచి చేస్తుంటే అడ్డుకోవడం దుర్మార్గంప్రజలు మీ చిల్లర చేష్టలు గమనిస్తున్నారుఇంకా పూర్తి స్థాయిలో వృద్దులకు, వితంతువులకు పెన్షన్ అందలేదు  నేటి నుంచి కృష్ణా జిల్లాలో హోమ్ ఓటింగ్..9:30 AM, May 2nd, 2024ఇంటివద్దనే ఓటు హక్కు వినియోగించుకోనున్న వయోవృద్ధులు ,దివ్యాంగులుహోమ్ ఓటింగ్ కోసం జిల్లా వ్యాప్తంగా 35 బృందాలు ఏర్పాటుగన్నవరం, పెనమలూరు, అవనిగడ్డ నియోజకవర్గాలలో 6 బృందాలు ఏర్పాటుపామర్రు నియోజకవర్గంలో 5 బృందాలు ఏర్పాటుమచిలీపట్నం, పెడన, గుడివాడ నియోజక వర్గాలలో 4 బృందాలు ఏర్పాటుఒక్కో హోమ్ ఓటింగ్ బృందంలో ఒక ప్రిసైడింగ్ అధికారి, ఒక సహాయ పోలింగ్ అధికారి, ఒక సూక్ష్మ పరిశీలకులు, ఒక వీడియో గ్రాఫర్,  పోలీస్ ఎస్కార్ట్ ఉండేలా చర్యలు ఉంటాయన్నారుహోమ్ ఓటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న 85 ఏళ్లు పైబడిన ఓటర్లు 9,114 మంది, దివ్యాంగులు 22,429 మంది  రెండు సార్లు జరుగనున్న హోమ్ ఓటింగ్ ప్రక్రియ  నేటి నుంచి మే 6 వరకూ ఒకసారిమే 7 నుంచి 8 వరకూ రెండోసారి హోమ్ ఓటింగ్‌కు అవకాశం మహాసేన రాజేష్‌కు ఘోర అవమానం..8:20 AM, May 2nd, 2024అవనిగడ్డలో టీడీపీ నేత మహాసేన రాజేష్‌కు అవమానంఎన్నికల ప్రచారానికి మహాసేన రాజేష్‌తో పాటు అంబటి రాయుడిని ఆహ్వానించిన జనసేన నాయకులుమోపిదేవి నుంచి అవనిగడ్డ వరకూ ర్యాలీ.. బహిరంగ సభ ఏర్పాటు చేసిన జనసేన నాయకులుమోపిదేవి కాలనీ అంబేద్కర్ విగ్రహం వద్ద స్వాగతం పలుకుతామని మహాసేన రాజేష్‌కు ఆహ్వానంమహాసేన రాజేష్ రాకుండానే అంబటి రాయుడితో కార్యక్రమం ప్రారంభించేసిన జనసేన నాయకులుతనను పిలిచి అవమానించడంతో జనసేన నేతల తీరుతో ఆగ్రహం వ్యక్తం చేసిన రాజేష్చల్లపల్లి నుంచి వెనుదిరిగిన మహాసేన రాజేష్జనసేన పార్టీలో దళితులపై వివక్ష మారలేదని తన అనుచరుల వద్ద వాపోయిన రాజేష్తన సీటు విషయంలో జనసేన చేసిన యాగీ మరిచిపోయి పొత్తు ధర్మం కోసం జనసేన తరుపున ప్రచారానికి వస్తే అవమానించారని  సన్నిహితుల వద్ద వాపోయిన రాజేష్ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వెనుతిరిగిన రాజేష్రాజేష్‌ను పిలిచి అవమానించారంటూ జనసేన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న దళిత సంఘాలు మధ్య తరగతికి మరింత భరోసా.. వైఎస్సార్‌సీపీ నవరత్నాలు ప్లస్‌ మేనిఫెస్టో7:45 AM, May 2nd, 2024వైఎస్సార్‌సీపీ నవరత్నాలు ప్లస్‌ మేనిఫెస్టోతో మరోసారి అండగా సీఎం జగన్‌పట్టణ ప్రాంతాల్లోని మధ్య ఆదాయ కుటుంబాలకు సరసమైన ధరలకే ఇళ్ల స్థలాలు123 పట్టణాల్లో ఎంఐజీ లే అవుట్ల అభివృద్ధిరూ.5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలకు ఆరోగ్య భరోసారూ.25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సహాయంకాపు, ఈబీసీ నేస్తం ద్వారా ఒక్కో కుటుంబానికి ఐదేళ్లలో రూ.60 వేల సాయంప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు విదేశీ విద్యా దీవెనతో తోడ్పాటురూ.10 లక్షల వరకు రుణానికి కోర్సు ముగిసే వరకు పూర్తి వడ్డీ చెల్లింపుఆప్కాస్, ఆశ, అంగన్‌వాడీ, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు నవరత్న పథకాలుప్రభుత్వ ఉద్యోగులకు సొంత జిల్లాలోనే 60 శాతం ప్రభుత్వ ఖర్చుతో ఇంటి స్థలం ‘భృతి’.. అంతా భ్రాంతి.. నిరుద్యోగులపై చంద్రబాబు మాయా వల7:20 AM, May 2nd, 2024నిరుద్యోగులపై చంద్రబాబు మరోసారి మాయా వలజాబు రావాలంటే బాబు రావాలంటూ 2014 ఎన్నికల్లో ప్రచారంకరపత్రాలు వేసి ఊరూరా పంపిణీ ఇంటికో ఉద్యోగం.. లేదంటే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ.. అధికారంలోకి వచ్చాక నాలుగున్నరేళ్లపాటు ఆ ఊసేలేదుప్రతిపక్ష నేత అసెంబ్లీలో బాబును ఉక్కిరిబిక్కిరి చేస్తే అసలా పథకమే లేదన్న అచ్చెన్నఆ ఒత్తిడి తట్టుకోలేక 2017–18 బడ్జెట్‌లో నిరుద్యోగ భృతికి రూ.500 కోట్లు కేటాయింపుఅయినా అమలుచేయని చంద్రబాబు.. 2019 ఎన్నికలకు ఆరునెలల ముందు ముఖ్యమంత్రి యువ నేస్తం పేరుతో పథకంనెలకు రూ.1,000 చొప్పున ఇస్తామని ప్రకటనసవాలక్ష ఆంక్షలతో కేవలం 12 లక్షల మంది నిరుద్యోగులకు అర్హతకానీ, 2018 అక్టోబరులో కేవలం రూ.40 కోట్లు విడుదల చివరికి 1.62 లక్షల మంది మాత్రమే అర్హులని తేల్చిన బాబు1.70 కోట్ల నిరుద్యోగులను నిలువునా మోసం చేసిన బాబుఎన్నికలు రావడంతో మళ్లీ యువతకు గేలం.. నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి అంటూ మాయమాటలుబాబు గత చరిత్ర చూడండి.. ఆయన్ను నమ్మొద్దంటూ యువతకు విద్యావేత్తలు, మేధావులు హితవు వైఎస్సార్‌సీపీ ఓటు బ్యాంకును చీల్చడమే షర్మిల లక్ష్యం7:00 AM, May 2nd, 2024పాడేరు కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థితో మంతనాలతో స్పష్టీకరణచంద్రబాబు నాయుడుకు మేలు చేయడమే అజెండాఆడియో లీక్‌తో అడ్డంగా దొరికిపోయిన వైనంపాడేరు కాంగ్రెస్‌ టికెట్‌ తొలుత వంతల సుబ్బారావుకుఆ తర్వాత వైఎస్సార్‌సీపీ నుంచి వెళ్లిన బుల్లిబాబుకి కేటాయింపుపాడేరులో కాంగ్రెస్‌ రెబల్‌గా వంతల పోటీపోటీ నుంచి తప్పుకోవాలని వంతలను ఆదేశించిన షర్మిలవైఎస్సార్‌సీపీ ఓటు బ్యాంకు కోసమే తాను బాధ్యతలు తీసుకున్నట్లు వెల్లడి  పచ్చ మంద కుట్రలతో పెన్షన్‌దారులకు కష్టాలు.. 6:30 AM, May 2nd, 2024చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్‌దారులకు మరిన్ని కష్టాలుబ్యాంకుల చుట్టూ తిరుగుతున్న వృద్దులు, వికలాంగులువాలంటీర్ల ద్వారా పెన్షన్లను ఇవ్వడాన్ని అడ్డుకున్న చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ఎన్నికల సంఘం ఆదేశాలతో బ్యాంకు ఖాతాలో పెన్షన్ వేసిన ప్రభుత్వండబ్బులు డ్రా చేసుకోవటానికి పెన్షన్‌దారుల అవస్థలునిన్న అన్నమయ్య, నంద్యాల జిల్లాల్లో పెన్షన్ కోసం వెళ్లి వడదెబ్బతో ఇద్దరు మృతిగత నెలలో 39 మంది వృద్దులు మృతిఇంటికే వచ్చే పెన్షన్ ను అడ్డుకున్న చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ వైఖరిపై మండిపడుతున్న పెన్షన్‌దారులు

Rowdy Sheeter Laxman Enters Into GHMC Mayor Vijayalakshmi's House
GHMC: మేయర్‌ విజయలక్ష్మి ఇంట్లో చొరబడిన రౌడీషీటర్‌..

సాక్షి, హైదరాబాద్‌: జీహెచ్ఎంసీ మేయర్  గద్వాల విజయలక్ష్మి ఇంట్లోకి ఓ రౌడీ షీటర్‌ చొరబడటం తీవ్ర కలకలం సృష్టించింది. సదరు వ్యక్తి నేరుగా మేయర్‌ గదిలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా సిబ్బంది అడ్డుకున్నారు. అనంతరం, పోలీసులు మేయర్‌ ఇంటికి వచ్చిన రౌడీ షీటర్‌ను అదుపులోకి తీసుకున్నారు.ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూసుఫ్‌గూడకు చెందిన రౌడీ షీటర్‌ లక్ష్మణ్‌ మంగళవారం మేయర్‌ విజయలక్ష్మి ఇంట్లోకి చొరబడ్డాడు. నేరుగా వచ్చి ఆమె వ్యక్తిగత గదిలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా ఆమె సిబ్బంది అడ్డుకున్నారు. సిబ్బంది వారించినా అతను పట్టించుకోలేదు. దీంతో, అతడిని సిబ్బంది అడ్డుకుని బంజారాహిల్స్‌ పోలీసులకు సమాచారం అందించారు. ఇక, ఆ సమయంలో మేయర్‌ ఇంట్లో లేరు.వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. లక్ష్మణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు పోలీసు స్టేషన్‌కు తరలించారు. అయితే, లక్ష్మణ్‌కు మతిస్థిమితం సరిగా లేనట్టు పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉండగా.. లక్ష్మణ్‌ గత రెండు రోజులుగా మేయర్‌ ఇంటి చుట్టే తిరిగినట్టు పోలీసులు తెలిపారు.

IPL 2024: SRH To Take On RR Today At Uppal Stadium, Hyderabad
ఐపీఎల్‌లో ఇవాళ (మే 2) కొదమ సింహాల సమరం

ఐపీఎల్‌లో ఇవాళ (మే 2) బిగ్‌ ఫైట్‌ జరుగనుంది. విధ్వంసకర వీరులతో నిండిన సన్‌రైజర్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లు హైదరాబాద్‌ వేదికగా అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇరు జట్లలో భారీ హిట్టర్లు ఉండటంతో ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.ప్రస్తుతం రాజస్థాన్‌ రాయల్స్‌ 9 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా.. సన్‌రైజర్స్‌ 9 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించి ఐదో స్థానంలో కొనసాగుతుంది. ప్రస్తుత సీజన్‌లో తిరుగులేని విజయాలతో దూసుకుపోతున్న రాజస్థాన్‌ అనధికారికంగా ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ ఖరారు చేసుకోగా.. సన్‌రైజర్స్‌ ప్లే ఆఫ్స్‌ రేసులో ప్రధాన పోటీదారుగా నిలిచింది.హెడ్‌ టు హెడ్‌ రికార్డుల విషయానికొస్తే.. ఐపీఎల్‌లో ఇరు జట్లు ఇప్పటివరకు 18 మ్యాచ​్‌ల్లో ఎదురెదురుపడగా.. చెరి 9 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి.  ఈ సీజన్‌లో రాజస్థాన్‌ ఒక్క గుజరాత్‌ చేతుల్లో మాత్రమే ఓడి మాంచి జోష్‌లో ఉండగా.. సన్‌రైజర్స్‌ కొన్ని మ్యాచ్‌ల్లో భారీ స్కోర్లు సాధిస్తూ మరికొన్ని మ్యాచ్‌ల్లో తక్కువ స్కోర్లకే చేతులెత్తేస్తూ అటుఇటు కాకుండా ఉంది.తుది జట్లు (అంచనా)..సన్‌రైజర్స్‌: అభిషేక్ శర్మ, ట్రవిస్ హెడ్, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్‌కీపర్‌), నితీష్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్‌), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టి నటరాజన్. [ఇంపాక్ట్ ప్లేయర్‌: అన్మోల్‌ప్రీత్ సింగ్/మయాంక్ మార్కండే]రాజస్థాన్‌ రాయల్స్‌: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (కెప్టెన్‌/వికెట్‌కీపర్‌), రియాన్ పరాగ్, షిమ్రోన్‌ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్. [ఇంపాక్ట్ ప్లేయర్‌: రోవ్‌మన్ పావెల్]

Colombia Cut Ties With Israel For having a genocidal President
ఇజ్రాయెల్‌కు షాక్‌.. ‘దౌత్య సంబంధాలు తెంచుకుంటాం’

కాల్పుల విరమణ ఒప్పందం జరిగినా తమ దాడులు  ఆగవని  ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు పేర్కొంటున్నారు. హమాస్‌కు గట్టిపట్టున్న రఫాలో వారిని  అంతం చేయటమే తమ సైన్యం లక్ష్యమని ముందుకు వెళ్లుతున్నాడు. అయితే మరోవైపు ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా.. పాలస్తీనా ప్రజలకు అనుకూలంగా అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు కొలంబియా దేశం షాక్  ఇచ్చింది. ఇజ్రాయెల్‌లో దేశంతో దౌత్యపరమైన సంబంధాలు తెంచుకుంటామని తెలిపింది. జాతి విధ్వంస ప్రధాని  బెంజమిన్‌ నెతన్యాహుతో తమ   దౌత్యపరమైన సంబంధాలు తెంచుకుంటుమని కొలంబియా దేశ అధ్యక్షుడు గుస్తావో పెట్రో తెలిపారు.‘‘గురువారం నుంచి ఇజ్రాయెల్‌తో ఉన్న దౌత్యపరమైన సంబంధాలు  తెంచుకుంటున్నాం. ఒక జాతి విధ్వంసక ప్రధానితో మేము ఇక సంబంధాలు కొనసాగించలేము. జాతి విధ్వంస ప్రవర్తన, జాతీ నిర్మూలనను ప్రపంచం అస్సలు  ఆమోదించదు. ఒకవేల పాలస్తీనియా  అంతం అయితే.. ప్రపంచంలో మానవత్వం అంతం అయినట్లే’’అని బుధవారం మే డే ర్యాలీలో  గుస్తావో పెట్రో అన్నారు.కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రోపై ఇజ్రాయెల్‌ స్పందించింది. ‘‘గుస్తావో పెట్రో ఇజ్రాయెల్‌ పౌరుల ద్వేషి, వ్యతిరేకి. ప్రాణాలు తీసే, అత్యాచారాలు చేసే హమాస్‌ మిలిటెంట్లకు పెట్రో  రివార్డులు ఇస్తానని హామీ ఇచ్చారు. వాటిని ప్రస్తుతం ఆయన బయటపెట్టారు’’ అని ఇజ్రాయెల్‌ విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ తెలిపారు. అత్యంత నీచమైన రాక్షసుల (హమాస్‌ మిలిటెంట్లు) పక్షాన నిలబడాలని నిర్ణయించుకున్న పెట్రోను చరిత్ర గుర్తుపెట్టుకుంటుదన్నారు. హమాస్‌ మిలిటెంట్లు చిన్నపిల్లను పొట్టనబెట్టుకున్నారని, మహిళలపై అత్యాచారం చేశారని, అమాయక ప్రజలను అపహరిచారని మండిపడ్డారు.హమాస్‌ మిలిటెంట్లు అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌పై మెరుపుదాడి చేసి.. 250 మందిని బంధీలుగా తీసుకెళ్లారు. కొంతమందిని హమాస్‌ మిలిటెంట్లు విడిచిపెట్టగా.. ఇంకా 129 మంది హమాస్‌ చెరలోనే ఉన్నారు. అక్టోబర్‌ 7 తర్వాత ప్రతీకారంతో ఇజ్రాయెల్‌ గాజాపై చేస్తున్నదాడుల్లో 34,568 మంది పాలస్తీనా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.

J&J subsidiary proposing paying Rs 54,000 cr over 25 years for cancer allegations
బేబీ పౌడర్‌తో అండాశయ క్యాన్సర్‌.. పరిష్కారానికి రూ.54వేలకోట్లు

జాన్సన్ అండ్‌ జాన్సన్ ప్రొడక్ట్‌లపై తీవ్ర దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. కంపెనీ అనుబంధ సంస్థ తయారుచేస్తున్న బేబీ పౌడర్‌లోని టాల్కమ్‌ స్త్రీల అండాశయ క్యాన్సర్‌కు కారణమవుతుందని ఇటీవల ఆరోపణలు వచ్చాయి. వాటిని పరిష్కరించడానికి 25 ఏళ్ల వ్యవధికిగాను కంపెనీ సుమారు 6.48 బిలియన్‌ డాలర్లు(రూ.54వేలకోట్లు) చెల్లించడానికి సిద్ధమైంది.స్త్రీల పరిశుభ్రత కోసం కంపెనీ తయారుచేస్తున్న టాల్కమ్ పౌడర్ ఉపయోగించడం ద్వారా ఊపిరితిత్తులు, ఇతర అవయవాలపై దాడిచేసే మీసోథెలియోమా, అండాశయ క్యాన్సర్‌ వస్తుందని ఆరోపణలు వచ్చాయి. అందుకు సంబంధించి కోర్టులో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. తమ ఉత్పత్తుల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని, కోర్టులో దాఖలైన వ్యాజ్యాల్లో ఏమాత్రం నిజం లేదని కంపెనీ స్పష్టం చేసింది.ఇదీ చదవండి: గూగుల్‌లో మళ్లీ లే ఆఫ్స్‌.. ఎందుకో తెలుసా..బుధవారం అనుబంధ సంస్థ పునర్నిర్మాణానికి 75% మంది వాటాదార్లు సానుకూలంగా ఓటు వేస్తే ప్రీప్యాకేజ్డ్‌ చాప్టర్‌ 11 దివాలాకు దాఖలు చేయొచ్చని కంపెనీ తెలిపింది. మెసోథెలియోమాకు సంబంధించిన పెండింగ్‌లో ఉన్న వ్యాజ్యాలను రిఆర్గనైజేషన్‌ ప్లాన్ వెలుపల పరిష్కరిస్తామని పేర్కొంది. 

Warangal Khammam Nalgonda Graduates MLC By Election Notification Out
TG: ‘మండలి’ నోటిఫికేషన్‌ విడుదల

హైదరాబాద్‌, సాక్షి: నల్గొండ-వరంగల్‌-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది. గురువారం ఉదయం నోటిఫికేషన్‌ విడుదల కాగా.. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్‌.. మొత్తం 12 జిల్లాలతో కూడిన ఈ నియోజకవర్గంలో పోటీ చేయాలనుకునే అభ్యర్థులంతా నల్లగొండ కలెక్టరేట్‌లోనే తమ నామినేషన్లను సమర్పించాల్సి ఉంది.  ఈ నెల 9వ నామినేషన్ల సమర్పణకు ఆఖరి తేదీ. నామినేషన్ల పరిశీలన 10వ తేదీన ఉంటుంది. 13వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఈ నెల 27వ తేదీన పోలింగ్‌ జరుగుతుంది. జూన్‌ 5వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే.  

Man Gives Triple Talaq to Wife in Moving Train
నడుస్తున్న రైలులో భార్యకు ట్రిపుల్‌ తలాక్‌!

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దేహాద్‌లో ట్రిపుల్‌ తలాక్‌ కేసు వెలుగులోకి వచ్చింది. కదులుతున్న రైలులో ఒక యువకుడు తన భార్యకు ట్రిపుల్ తలాక్ ఇచ్చాడు. ఈ క్రమంలో భార్యపై దాడిచేసి, రైలు నుంచి దూకి పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను వేడుకున్నారు.బాధితురాలు పుఖ్రాయాన్ పోలీస్ స్టేషన్‌లో భర్తపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఆమె భర్తతో సహా నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అదనపు కట్నం డిమాండ్‌ చేస్తూ తన భర్త విడాకులు ఇచ్చాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.ఈ  ఉదంతం గురించి భోగానిపూర్ పోలీసు అధికారి మాట్లాడుతూ బాధితురాలు రాజస్థాన్‌కు చెందిన మహిళ అని, నఫీజుల్ హసన్ కుమారుడు మహమ్మద్ అసద్‌ ఆమెను వివాహం చేసుకున్నాడని తెలిపారు. ఆ తరువాత నుంచి భర్త మహ్మద్‌ అసద్‌ అత్తామామలు తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. తాజాగా భర్త తనకు ట్రిపుల్‌ తలాక్‌ చెప్పాడని ఆమె తెలిపారు. 

TDP Chandrababu Fake Promise To Unemployed Youth
‘భృతి’.. అంతా భ్రాంతి.. నిరుద్యోగులపై చంద్రబాబు మాయా వల

సాక్షి, అమరావతి:  ‘‘జాబు రావాలంటే బాబు రావాలి.. తమ్ముళ్లూ మీ కలలు సాకా­రం చేయబోతున్నా.. ఇంటికొక ఉద్యోగం ఇస్తా.. ఉద్యో­గం ఇవ్వకపోతే ఉపాధి కల్పిస్తా.. మీరేమీ చదువుకోకపోయినా నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.2 వేలిస్తా’’..  ఈ హామీ గుర్తుందా? 2014 ఎన్నికల్లో చంద్రబాబు సంతకంతో కూడిన కరపత్రాన్ని తెలుగుదేశం పార్టీ ఊరూరా పంచుతూ ప్రచారం చేసింది. సీన్‌ కట్‌చేస్తే ఆ ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. చెప్పినట్లుగా నిరుద్యోగులకు ఇచ్చిన హామీ అమలుచేశారా అంటే అనేకానేక హామీల్లాగే అదీ బాబు అటకెక్కించేశారు. ఇప్పుడు మళ్లీ అలాంటి హామీతోనే ఆయన మరోసారి యువతకు వల విసురుతున్నారు. ఆయన మాయలో పడొద్దని.. భవిష్య­త్తును నాశనం చేసుకోవద్దని మేధావులు, విద్యావేత్తలు యువతకు సూచిస్తున్నారు.  నిరుద్యోగ భృతి ఇవ్వబోమన్న అచ్చెన్న.. ఇక అధికారంలోకి వచ్చాక నాలుగున్నరేళ్ల పాటు చంద్రబాబు ఆ ఊసే ఎత్తలేదు. కానీ, నాటి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మాత్రం సందర్భం వచ్చిన ప్రతీసారి ఈ అంశంపై చంద్రబాబు సర్కారును నిలదీస్తూనే ఉన్నారు. నిరుద్యోగ భృతి చెల్లిస్తానని యువతకు మాటిచ్చి ఎలా విస్మరిస్తారంటూ ఉక్కిరిబిక్కిరి చేశారు. ఈ ఒత్తిడి తట్టుకోలేక వైఎస్సార్‌సీపీ సభ్యుల ప్రశ్నకు నిరుద్యోగ భృతి అనే పథకమేలేదని, ఈ ప్రశ్న ఉత్పన్నమే కాదంటూ నాటి కార్మిక శాఖ మంత్రి అచ్చన్నాయుడు అసెంబ్లీలో అసలు విషయాన్ని కుండబద్దలు కొట్టారు. శిక్షణనిచ్చి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని, నిరుద్యోగ భృతి ఇవ్వబోమని, బాబు వస్తే జాబు వస్తుందనే నినాదంతో ఎన్నికల్లో వెళ్లిన మాట వాస్తవమేనని ఆయన చెప్పారు. అయినా, నిరుద్యోగ భృతిపై అసెంబ్లీలో జగన్‌ పట్టువిడవకుండా ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతుండడంతో 2017–18లో బడ్జెట్‌లో టీడీపీ ప్రభుత్వం కంటితుడుపుగా రూ.500 కోట్లు కేటాయించింది. దీనిపై జగన్‌ మండిపడుతూ.. జాబు రావాలంటే బాబు రావాలని, జాబు ఇవ్వకపోతే ఇంటికో ఉద్యోగం ఇస్తానంటూ ఎన్నికల ముందు ఇంటింటా ప్రచారం చేసి ఇప్పుడు గొప్పగా రూ.500 కోట్లు కేటాయించామని చెప్పడం నిరుద్యోగులను నిలువునా మోసం చేయడమేనని ఉతికి ఆరేశారు. అంతేకాక.. రాష్ట్రంలో 1.75 కోట్ల కుటుంబాలున్నాయని, ఒక్కో కుటుంబానికి నెలకు రెండువేల చొప్పున భృతి ఇవ్వాలని.. ఇందుకు నెలకు రూ.3,500 కోట్లు అవసరమని, అలాగే ఏడాదికి రూ.40 వేల కోట్లు అవసరమైతే రూ.500 కోట్లు ఏ మూలకు సరిపోతాయంటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని వైఎస్‌ జగన్‌ చీల్చిచెండాడారు.  ఉన్న ఉద్యోగాలకు బాబు ఎసరు.. ఇలా నిరుద్యోగ భృతి ఇస్తానంటూ నాలుగున్నరేళ్ల పాటు ఎగమనామం పెట్టి ఎన్నికల ముందు ఆర్నెల్లపాటు యువతను మోసం చేయడానికి కంటితుడుపు చర్యగా ముఖ్యమంత్రి యువనేస్తం పేరుతో చంద్రబాబు ఎత్తుగడ వేశారు. కానీ, నిరుద్యోగ భృతి ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకపోగా ఆరోగ్య మిత్రలను, ఫీల్డ్‌ అసిస్టెంట్లను, గోపాల మిత్రలను ఉద్యోగాల నుంచి చంద్రబాబు తొలగించారు. దీంతో.. మళ్లీ ఇప్పుడు ఎన్నికల ముందు యువతను, నిరుద్యోగులను మోసం చేయడానికి చంద్రబాబు కుయుక్తులు, మోసపూరిత ప్రకటనలతో వస్తున్నారు తస్మాత్‌ జాగ్రత్త నిరుద్యోగులూ.. అంటూ మేధావులు, విద్యావేత్తలు యువతను అప్రమత్తం చేస్తున్నారు. నిరుద్యోగ భృతిపై 2014 ఎన్నికల ముందు ఇంటింటా ప్రచారం చేసి అధికారం దక్కాక ఎలా మోసం చేశారో అచ్చు అలాగే చంద్రబాబు మళ్లీ యువతకు నెలకు రూ.3వేలు నిరుద్యోగ భృతి అంటూ అరచేతిలో వైకుంఠం చూపెడుతున్నారని.. చంద్రబాబు వలలో పడి మరోసారి మోసపోవద్దని వారు సూచిస్తున్నారు.వైఎస్‌ జగన్‌ ఒత్తిడితో.. ఎన్నికలకు ఆర్నెల్ల ముందు.. ఇక 2017–18లో రూ.500 కోట్లు కేటాయించినప్పటికీ చంద్రబాబు పైసా ఖర్చు పెట్టలేదు. ప్రతిపక్ష నేత జగన్‌ తన ఒత్తిడి కొనసాగిస్తుండడంతో ఇక 2019 ఎన్నికలకు ఆర్నెల్ల ముందు నాలుగు నెలల కోసం నిరుద్యోగ భృతి కాదు ముఖ్యమంత్రి యువనేస్తం పేరుతో నిరుద్యోగులకు నెలకు రూ.1,000 ఇస్తామని చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు విధివిధానాల రూపకల్పనకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటుచేసింది. ఈ ఉపసంఘం సవాలక్ష ఆంక్షలు విధించి నిరుద్యోగ భృతి ఇచ్చే వారి సంఖ్యను భారీగా కుదించింది.  ⇒ టెన్త్, ఇంటర్‌ చదివిన వారు అనర్హులని ఆంక్షలు విధించింది.  ⇒ 22 ఏళ్ల నుంచి 35 ఏళ్లలోపు వారు డిగ్రీ చదివిన వారికే భృతి వర్తిస్తుందని, దారిద్య్ర రేఖకు దిగువనున్న వారు.. తెల్ల రేషన్‌ కార్డు, ఆధార్‌ కార్డు, ఓటరు ఐడీ కార్డు పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలని షరతులు విధించింది.  ⇒ దీంతో వచ్చిన దరఖాస్తుల్లో 12 లక్షల మందికి పైగా నిరుద్యోగ భృతికి అర్హులుగా తేల్చింది.  ⇒ ఆ తరువాత అది పది లక్షలు, మళ్లీ మళ్లీ వడపోత తర్వాత 2.10 లక్షల మందే అర్హులంటూ వెల్లడించి మళ్లీ దానిని 1.62 లక్షలకు కుదించింది.  ⇒ అనంతరం 2018 అక్టోబరులో కేవలం రూ.40 కోట్లు విడుదల చేసి ఈ–కేవైసీ మెలిక పెట్టింది.  ⇒ అలాగే, ప్రతినెలా వేలిముద్ర వేస్తేనే నిరుద్యోగ భృతి అంటూ ఆంక్షలు పెట్టుకుంటూ పోయి ఎన్నికల వరకు తాత్సారం చేశారు. 

Mahesh Babu Pens A Note On Her Father Movie Completes 50 Years
నాన్నను అలా చూడటం ఇప్పటికీ గుర్తుంది: మహేశ్ బాబు

సూపర్ స్టార్‌ కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు తెలుగు సినిమాలో ఎప్పటికీ చెరగని ముద్ర వేసింది. 1974లో రామచంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. అల్లూరి సీతారామరాజు మూవీ విడుదలై మే 1వ తేదీ నాటికి 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్రిన్స్ మహేశ్‌బాబు ట్వీట్ చేశారు. నాన్న నటించిన చిత్రంపై ప్రశంసలు కురిపించారు.మహేశ్ బాబు తన ట్వీట్‌లో రాస్తూ..' నాన్నగారిని తెరపై గంభీరమైన లుక్‌లో చూసి ఆశ్చర్యపోవడం నాకు ఇప్పటికీ గుర్తుంది. ఇప్పుడు చూసినా మొదటిసారి చూసినట్లే ఉంది. ఈ సినిమా నేటికి 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నటుడిగా నా ప్రయాణం, తెలుగు సినిమాపై నా ప్రభావాన్ని గుర్తుచేసుకుంటున్నా' అని పోస్ట్ చేశారు. కాగా.. ఈ ఏడాది గుంటూరు కారంతో అభిమానులను అలరించిన మహేశ్‌బాబు.. నెక్ట్స్ మూవీ దర్శకధీరుడు రాజమౌళితో చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ కూడా సిద్ధమైంది. అయితే ఈ మూవీ షూటింగ్‌ ప్రారంభం కావాల్సి ఉంది.  #50YearsOfAlluriSeetaramaRaju… Still recall watching it for the first time and being awestruck by Nanna garu’s majestic presence on screen. As the film completes 50 years today, I’m reminded of its profound influence on my journey as an actor and on Telugu cinema. ♥️♥️♥️ pic.twitter.com/CdhAfSr0OI— Mahesh Babu (@urstrulyMahesh) May 1, 2024

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement


ఫోటో స్టోరీస్

View all