అగ్రిగోల్డ్ సంస్థలో మరో కుంభకోణం | Sakshi
Sakshi News home page

అగ్రిగోల్డ్ సంస్థలో మరో కుంభకోణం

Published Sat, Jan 16 2016 9:55 AM

అగ్రిగోల్డ్ సంస్థలో మరో కుంభకోణం - Sakshi

విజయవాడ : అగ్రిగోల్డ్ సంస్థలో మరో కుంభకోణం వెలుగు చూసింది. ఆ సంస్థ అగ్రిగోల్డ్ పరివార్ మ్యూచువల్ కో-ఆపరేటివ్ సొసైటీ పేరుతో రూ.వందల కోట్లు వసూలు చేసింది. ప్రతి నెలా వడ్డీ చెల్లిస్తామంటూ డిపాజిట్లు సేకరించింది. అగ్రిగోల్డ్ ఖాతాదారుల ఫిర్యాదుపై ఈ నెల 19న విచారణ జరగనుంది.  ఇందుకు సంబంధించి డివిజనల్ కో-ఆపరేటివ్ అధికారి ...అగ్రిగోల్డ్ సంస్థకు నోటీసులు జారీ చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 కాగా అగ్రిగోల్డ్ సంస్థలో పెట్టుబడులు పెట్టి సుమారు 40 లక్షల మంది నష్టపోయిన సంగతి తెలిసిందే. వీరిలో 32 లక్షల మంది డిపాజిటర్లు కాగా 8 లక్షల మంది ఏజెంట్లు ఉన్నారు. ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలలో కార్యకలాపాలు నిర్వహించి దివాళా తీసింది. ప్రస్తుతం సంస్థకు చెందిన ఆస్తులను వేలం వేసి బాధితులకు ఊరట కల్పించే నిర్ణయంలో భాగంగా ఈ త్రిసభ్య కమిటీని కోర్టు నియమించింది.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement