తాగుడు మాన్పిస్తే జనం పిచ్చివాళ్లవుతారు | Sakshi
Sakshi News home page

తాగుడు మాన్పిస్తే జనం పిచ్చివాళ్లవుతారు

Published Sun, Jun 5 2016 3:34 AM

తాగుడు మాన్పిస్తే జనం పిచ్చివాళ్లవుతారు - Sakshi

నవనిర్మాణ వారోత్సవాల్లో చంద్రబాబు
సాక్షి, అమరావతి: మద్యపానం అలవాటును మాన్పిస్తే ప్రజలకు పిచ్చిపడుతుందని సీఎం చంద్రబాబుఅన్నారు. నవనిర్మాణ వారోత్సవాల్లో భాగంగా విజయవాడ ఏ కన్వెన్షన్‌లో మూడో రోజు కార్యక్రమంలో పాల్గొన్నారు. బెల్టు షాపుల వల్ల ఎక్కువ తాగుతున్నారని, తామంతా కలిసి వీటిని తొలగించినా మరో చోటికి వెళ్లి తాగొస్తున్నారని డ్వాక్రా సంఘ సభ్యురాలు చంద్రావతి  సీఎం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన బాబు తాగుడు మాన్పిస్తే ప్రజలు పిచ్చివాళ్లవుతారన్నారు. అంతలోనే సర్దుకుని  ఒక్కసారిగా కాకుండా క్రమేపీ మాన్పించాలన్నారు. ఈ భేటీలో  బాబు విద్యాధికులపైనా వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర జనాభా వృద్ధి తగ్గిపోయిందని, ఇదే విధంగా జరిగితే జపాన్ మాదిరిగా రోబోలతో పనులు చేయించుకోవాల్సి వస్తుందన్నారు. చదువుకున్న వాళ్లలో స్వార్థం పెరిగి పిల్లలు వద్దనుకోవడమే ఇందుకు కారణమన్నారు.

 నా స్ఫూర్తితోనే..
తాను ఉమ్మడి రాష్ట్రంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రోత్సహించడం వల్లే సత్యనాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈవో అయ్యారని సీఎం చెప్పారు. తన స్ఫూర్తితోనే ఆయన ఈ స్థాయికి ఎదిగారన్నారు. 

 ‘రాజధాని’కి దేశీయ ఆర్కిటెక్ట్‌ల డిజైన్లు
సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధానిలో ప్రభుత్వ భవన సముదాయాలకు సంబంధించి దేశీయ ఆర్కిటెక్ట్‌లు రూపొందించిన డిజైన్లను    బాబు పరిశీలించారు.ఆర్కిటెక్ట్ సంస్థలతో సీఆర్‌డీఏ ఉన్నతాధికారులు ఓ హోటల్లో సమావేశమయ్యారు.  హఫీజ్ కాంట్రాక్టర్, సిక్ అసోసియేట్స్ తదితర సంస్థలు డిజైన్లను సమర్పించాయి. వాటిలో ఉత్తమమైదాన్ని ఎంపిక చేయాలని బాబు సీఆర్‌డీఏకు సూచించారు.

Advertisement
Advertisement