నేటి నుంచి ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్

27 May, 2016 01:19 IST|Sakshi

సాక్షి, విజయవాడ బ్యూరో: ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ శుక్రవారం ప్రారంభిస్తున్నట్టు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. జూన్ 6 నుంచి 15 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్, జూన్ 9 నుంచి 18 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు, 19, 20 తేదీల్లో ఆప్షన్ల మార్పునకు అవకాశం ఉంటుందని చెప్పారు. జూన్ 22న సీట్లు కేటాయిస్తామని, జూన్ 27 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని ఆయన విజయవాడలో తెలిపారు.

మరిన్ని వార్తలు