అపూర్వ సమ్మేళనం | Sakshi
Sakshi News home page

అపూర్వ సమ్మేళనం

Published Mon, Jul 25 2016 12:12 AM

అపూర్వ సమ్మేళనం

కడప ఎడ్యుకేషన్‌:
 కడపలోని బీగ్‌–సీ పైన ఉన్న టర్నింగ్‌ పాయింట్‌ స్టడీ సెంటర్‌లో ఆదివారం 2006 బీఎడ్‌ బ్యాచ్‌కు చెందిన విద్యార్థులు సమ్మేళనం  జరిగింది. ఈ సందర్భంగా ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి సాయం అందించడానికి ముందుకు పోవాలని సంకల్పంతో ఉన్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతు 2006లో కడప లోని ఎస్వీ బీఎడ్‌ కళాశాలలో చదివిన రోజులను గుర్తు చేసుకున్నారు. కొందరి అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.

పదేళ్లు తర్వాతకలుసుకోవడం ఆనందంగా ఉంది..
2006లో బీఎడ్‌ చదివి పదేళ్లు తరువాత తోటి స్నేహితులను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. బీఎడ్‌ పూర్తి అయిన వెంటనే పోలీస్‌ డిపార్టుమెంట్‌లో ఎస్‌ఐగా శిక్షణకు పోయాను. ప్రస్తుతం చిత్తూరు జిల్లా మదనపల్లె అర్బన్‌ ఎస్‌ఐగా పనిచేస్తున్నాను.
    – రవి ప్రకాశ్‌రెడ్డి, మదనపల్లె ఎస్‌ఐ, చిత్తూరు జిల్లా

సాయం చేయాలనుకోవడం మంచి నిర్ణయం
ఆపదలో ఉన్న స్నేహితులకు సాయం చేయాలను కోవడం మంచి నిర్ణయం. 2006లో బీఎడ్‌ చదువుతున్న సమయం లో పూర్తిగా ఎంజాయి చేశాం. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో దత్తలూరులో శ్రీ విశ్వతేజ ఇంగ్లీష్‌ స్కూల్‌ పెట్టి పేద విద్యార్థులకు  ఉచితంగా విద్యను అందిస్తున్నాను.     – డీ వాసుదేవారెడ్డి,  నెల్లూరు జిల్లా
స్నేహం మరపురానిది..
స్నేహితులు ఎవరు ఆపదలో ఉన్నా మేం ఉన్నాం అంటూ ముందుకు పోయి సాయం అందించడంలో 2006 బ్యాచ్‌ బీఎడ్‌ విద్యార్థులు ఉండాలి.  నేను బెంగుళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుగా పనిచేస్తున్నాను. పూర్వ విద్యార్థులు కలుస్తున్నామని అనుకోవడంలోనే పూర్తి ఎంజాయి చేశాం.     – రాజశేఖర్, సాఫ్ట్‌వైర్‌ ఇంజనీరు  బెంగుళూరు
 

Advertisement
Advertisement