బ్యాడ్మింటన్‌ టోర్నమెంటుకు ఏర్పాట్లు సిద్ధం | Sakshi
Sakshi News home page

బ్యాడ్మింటన్‌ టోర్నమెంటుకు ఏర్పాట్లు సిద్ధం

Published Sun, Nov 13 2016 10:33 PM

బ్యాడ్మింటన్‌ టోర్నమెంటుకు ఏర్పాట్లు సిద్ధం

కడప సెవెన్‌రోడ్స్‌ : కడప నగరం వైఎస్సార్‌ ఇండోర్‌ స్టేడియంలో మంగళవారం నుంచి ప్రారంభమయ్యే ఆలిండియా సీనియర్‌ ర్యాంకింగ్‌ బ్యాడ్మింటన​ టోర్నమెంటు - 2016 నిర్వహణకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు కలెక్టర్‌ కేవీ సత్యనారాయణ తెలిపారు. ఆదివారం సాయంత్రం తన చాంబర్‌లో తొలిసారిగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ర్యాంకింగ్‌ ఈ టోర్నమెంటు ప్రత్యేకత అని పేర్కొన్నారు. పాయింట్ల ఆధారంగా ర్యాంకింగ్‌ ఉంటుందన్నారు. సుమారు 500 మంది క్రీడాకారులు టోర్నమెంటులో పాల్గొనే అవకాశం ఉందన్నారు. పీవీ సింధు విదేశాల్లో ఆడుతుండడం వల్ల ఆమె  రావడం లేదన్నారు.
క్రీడాకారులే వసతి ఏర్పాటు చేసుకోవాలి
తమ బస తామే ఏర్పాటు చేసుకోవాలని క్రీడాకారులకు సూచించారు. తొలిరోజు ఫస్ట్, సెకండ్‌ కాల్విఫయింగ్‌ రౌండ్స్‌ జరుగుతాయని, బుధవారం థర్డ్, ఫైనల్‌ క్వాలిఫయింగ్‌ రౌండ్స్‌ ఉంటాయన్నారు. 17న ఇనాగరల్‌ సెషన్‌ నిర్వహిస్తామని, 18న సెకండ్, థర్డ్‌ రౌండ్‌ మ్యాచెస్‌ ఉంటాయని తెలిపారు. శనివారం ఉదయం క్వార్టర్‌ ఫైనల్స్, సాయంత్రం సెమీఫైనల్స్, ఆదివారం ఫైనల్స్, అనంతరం ముగింపు సమావేశం ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. స్టేడియంలో భవిష్యత్తులో అంతర్జాతీయ టోర్నమెంట్లు నిర్వహించే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. టోర్నమెంట్‌కు స్పాన్సర్‌గా ఏపీ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ వ్యవహరిస్తోందని చెప్పారు.
మొత్తం 171 మ్యాచ్‌లు
జిల్లా బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ కార్యదర్శి జిలానీబాషా మాట్లాడుతూ ఈవెంట్‌ వైజ్‌ మొత్తం 171 మ్యాచ్‌లు జరుగుతాయని, ఈ వివరాలు వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని తెలిపారు. సమావేశంలో ఆర్డీఓ చిన్నరాముడు, డీఎస్‌డీఓ లకీ‡్ష్మనారాయణ శర్మ, సీపీఓ తిప్పేస్వామి, మెప్మా పీడీ వెంకట సుబ్బయ్య, బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు సంజయ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement