‘భువన్‌ పంచాయత్‌’పై అవగాహన సదస్సు | Sakshi
Sakshi News home page

‘భువన్‌ పంచాయత్‌’పై అవగాహన సదస్సు

Published Wed, Aug 10 2016 11:58 PM

‘భువన్‌ పంచాయత్‌’పై అవగాహన సదస్సు

వెలిమినేడు (చిట్యాల) : మండలంలోని వెలిమినేడు గ్రా మంలో భువన్‌ పంచాయత్‌ వెబ్‌ పోర్టల్‌–మొబైల్‌ యాప్‌పై బుధవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్‌ఆర్‌ఎస్‌ఏ, టీఆర్‌ఏసీ శాస్త్రవేత్తలు జైశీలన్, సత్యనారాయణ, తెలంగాణ రిమోట్‌ సెన్సీవ్‌ సెంటర్‌ (ట్రాక్‌) అడిషనల్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇస్రో, నేషనల్‌ రిమోట్‌ సెన్సీవ్‌ సెంటర్, తెలంగాణ రాష్ట్ర రిమోట్‌ సెన్సీవ్‌ సెంటర్ల సంయుక్త అధ్వర్యంలో ఏర్పాటు చేసిన భువన్‌ పంచాయత్‌ వెబ్‌ పోర్టల్‌–మొబైల్‌ యాప్‌ను గ్రామాభివృద్ధి కోసం అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ఇందుకు పైలేట్‌ ప్రాజెక్ట్‌గా వెలిమినేడు, పిట్టంపల్లి గ్రామాలను తీసుకున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఇప్పటికే సహజ సిద్ధ నైసర్గిక స్వరూపాలను, కట్టడాలను, అవసరమైన మౌలిక వసతులను సేకరించినట్లు తెలిపారు. గ్రామస్తులు ఎవరైనా సరే వారు సేకరించిన సమాచారాన్ని నేరుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వవచ్చున్నారు. తద్వారా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ శేపూరి  రవీందర్, వెలిమినేడు, పిట్టంపల్లి గ్రామాల సర్పం చ్‌లు మద్దెల మల్లయ్య, నారగోని దుర్గయ్య, డివిజనల్‌ ఉప గణాంకాధికారి ముత్తయ్య, ట్రాక్‌ ప్రతినిధులు నరేందర్, రవీందర్, కిరణ్, సత్యనారాయణ, రమేష్, రాజు, ఏఎస్‌ఓ శ్రీనివాసులు, ఏపీడీ రవీందర్‌రెడ్డి, ఏపీఓ యాదయ్య, ఎంపీటీసీలు నెల్లికంటి నర్సింహా, అర్రూరి శ్రీను పాల్గొన్నారు.

Advertisement
Advertisement