ఎయిడ్స్‌ రహిత జిల్లాగా కృషి | Sakshi
Sakshi News home page

ఎయిడ్స్‌ రహిత జిల్లాగా కృషి

Published Thu, Dec 1 2016 11:37 PM

ఎయిడ్స్‌ రహిత జిల్లాగా కృషి - Sakshi

నెల్లూరు(బారకాసు):
2030 నాటికి ఎయిడ్స్‌ రహిత జిల్లాగా తీర్చిదిద్దేంకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఏజేసీ రాజ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. ప్రపంచ ఎయిడ్స్‌ దినం సందర్భంగా జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో గురువారం నగరంలో ఎయిడ్స్‌పై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం టౌన్‌హాల్లో నిర్వహించిన సభలో ఏజేసీ మాట్లాడారు. జిల్లాలో ఎయిడ్స్‌ వ్యాప్తి కాకుండా స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎయిడ్స్‌ రహిత సమాజ స్థాపన అందరి బాధ్యత అని చెప్పారు. ఈవ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలన్నారు. అనంతరం ఎయిడ్స్‌ రహిత జిల్లాగా మార్చేందుకు తమ వంతు కృషి చేస్తామని అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ వరసుందరం మాట్లాడుతూ ఎయిడ్స్‌ నిర్మూలనకు తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటికే అనేక అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేశామన్నారు. అనంతరం ఎయిడ్స్‌పై పనిచేస్తున్న ఎనిమిది స్వచ్ఛందసంస్థల నిర్వాహకులకు, వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన వివిధ నర్సింగ్‌ కళాశాలలోని విద్యార్థినులకు బహుమతులు ప్రదానం చేశారు. అంతకు ముందు నగరంలోని గాంధీబోమ్మ సెంటర్‌ నుంచి టౌన్‌హాల్‌ వరకు ఎయిడ్స్‌పై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ఏజేసీ జెండా ఊపీ ప్రారంభించారు. జిల్లా ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ నిర్వహణలో జరిగిన ఈకార్యక్రమంలో ఏడీఎంహెచ్‌ఓ(ఎయిడ్స్,లెప్రసీ) డాక్టర్‌ రమాదేవి, డీటీసీఓ డాక్టర్‌ సురేష్‌కుమార్, జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ భారతి, ఎన్‌ఎన్‌పీ ప్లస్‌ సంస్థ నిర్వాహకురాలు ధనూజ, హిజ్రాల సంఘం జిల్లా అధ్యక్షురాలు అలేఖ్య పాల్గొన్నారు.
 
 

Advertisement
Advertisement