గ్రామీణ వైద్యులు సహకరించాలి | Sakshi
Sakshi News home page

గ్రామీణ వైద్యులు సహకరించాలి

Published Fri, Sep 23 2016 1:56 AM

గ్రామీణ వైద్యులు సహకరించాలి

 
  • జేసీ–2 రాజ్‌కుమార్‌
నెల్లూరు(అర్బన్‌) : జిల్లాలో విషజ్వరాలు ప్రబలకుండా గ్రామీణ వైద్యులైన ఆర్‌ఎంపీలు, పీఎంపీలు సహకరించాలని జేసీ–2 రాజ్‌కుమార్‌ కోరారు. స్థానిక సంతపేటలోని జిల్లా వైద్య శాఖ కార్యాలయంలో గురువారం దోమలపై దండ యాత్ర– పరిసరాల పరిశుభ్రత అనే అంశంపై అవగాహన సదస్సు జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి జ్వరం వచ్చినా గ్రామాల్లో మొదట పీఎంపీ, ఆర్‌ఎంపీ దగ్గరకు ప్రజలు వైద్యం కోసం వెళ్తారన్నారు. ఎలీసా పరీక్ష చేయకుండా, లక్షణాలను బట్టి డెంగీ అని నిర్ధారించకూడదని సూచించారు. దోమలు నివారణకు, పరిసరాల పరిశుభ్రత కోసం వైద్యశాఖతో పాటు అన్ని శాఖల అధికారులు సహకరిస్తునాన్నారని చెప్పారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ వరసుందరం, పీఎంపీ అధ్యక్ష, కార్యదర్శిలు శాఖవరపు వేణుగోపాల్, షేక్‌ సత్తార్, తెలుగునాడు పారామెడిక్స్‌ అసోసియేషన్‌ నాయకులు రత్నం తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement