బాబు సర్కారుకు బుద్ధి చెబుదాం | Sakshi
Sakshi News home page

బాబు సర్కారుకు బుద్ధి చెబుదాం

Published Tue, Feb 14 2017 1:21 AM

బాబు సర్కారుకు బుద్ధి చెబుదాం - Sakshi

గుంతకల్లు టౌన్  : పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి కరువు జిల్లా సమస్యలపైన, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న కష్టాలపైన అలుపెరగని పోరాటాలు చేయగల యోధుడని, ఆయనను భారీ మెజార్టీతో గెలిపించి చంద్రబాబు సర్కారుకు బుద్ధి చెబుదామని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక రాయల్‌ పంక్షన్ హాల్‌లో సోమవారం పార్టీ నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాన్ని సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ అధికారాన్ని అడ్డుపెట్టుకుని సీఎం చంద్రబాబు, ఆ పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు దౌర్జన్యకాండను కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉండీ ప్రయోజనం లేదన్నారు. హంద్రీనీవా ద్వారా జిల్లాలోని 1,270 చెరువులకు, 6.5 లక్షల ఎకరాలకు సాగునీరు ఇప్పించాలన్న ధ్యాస వారికి ఏమాత్రమూ లేదన్నారు. నీళ్లకు గండికొడుతున్నా, పరిశ్రమలు రాకపోయినా, రైల్వేజోన్ ఏర్పాటు చేయకపోయినా నోరుమెదపకపోవడం సిగ్గుచేటన్నారు. మంత్రి పల్లె రెడ్డి కాబట్టి ఆయనతో ప్రతిపక్ష నేత వైఎస్‌.జగన్ మోహన్ రెడ్డిపై వ్యక్తిగత దూషణలు చేయిస్తూ చంద్రబాబు పైశాచిక ఆనం దం పొందుతున్నారని దుయ్యబట్టారు. మూడేళ్లయినా సెంట్రల్‌ యూనివర్సిటీ అతీగతీ లేదని,  మంత్రి పల్లె మాత్రం అగ్రికల్చర్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు అనుమతులు తెచ్చుకున్నారని విమర్శిం చారు. తాడూ బొంగరాల్లేని పారిశ్రామికవేత్తలతో జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ఎంఓ యూ కుదర్చుకుందన్నారు. పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాగేపరుశరామ్‌ మాట్లాడుతూ జిల్లా మం త్రులు చేతకాని దద్దమ్మల్లా వ్యవహరిస్తున్నారన్నా రు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘన త దివంగత సీఎం వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డిదేనని రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నదీమ్‌ అహ్మద్‌ తెలిపారు. ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ టీడీపీ అరాచక పాలనకు సమాధి కట్టాలంటే ఈ ఎన్నికల్లో సత్తా చాటాలన్నారు. పట్టభద్రులను చైతన్యవంతులను చేసి తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయించి గెలిపించాలని అభ్యర్థించారు. 
 
టీడీపీ దౌర్జన్యాలకు భయపడేది లేదు : వైవీఆర్‌
టీడీపీ చేస్తున్న దౌర్జన్యాలకు భయపడే ప్రసక్తే లేదని గుంతకల్లు సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి అన్నారు. టీడీపీకి పతనం మొదలైందని, కడుపు మండి నోడి పోరాటం ఏ విధంగా ఉంటుందో చంద్రబాబు త్వరలో చవిచూడాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆయనకన్నా ప్రజలు చాలా మేధావులని, ఎప్పుడు, ఏ విధంగా దెబ్బతీయాలో వారికి బాగా తెలుసని చెప్పారు. వెన్నపూస గోపాల్‌రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించి, ఆయన విజయాన్ని వైఎస్‌.జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇవ్వాలని పార్టీ శ్రేణులను కోరారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గాదిలింగేశ్వరబాబు, ఎస్సీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింకల రామాంజినేయులు, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు వీరాంజినేయులు, రాష్ట్ర నాయకుడు బాలకృష్ణారెడ్డి, గుంతకల్లు పట్టణ, మండల అధ్యక్షులు వై.సుధాకర్, మోహన్ రావు, గుత్తి మండలాధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి, పామిడి అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి, సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, దిలీప్‌రెడ్డి, వైఎస్సార్‌టీయూ రాష్ట్ర కార్యదర్శులు త్యాగరాజు, మల్లికార్జున శాస్త్రి, సింగిల్‌విండో వైస్‌చైర్మన్ సుంకిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, గుత్తి మాజీ సర్పంచ్‌ పీరా, మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ మల్లయ్యయాదవ్, గుంతకల్లు, గుత్తి, పామిడి కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement