రసవత్తరంగా బ్యాడ్మింటన్‌ పోరు | Sakshi
Sakshi News home page

రసవత్తరంగా బ్యాడ్మింటన్‌ పోరు

Published Fri, Nov 18 2016 12:15 AM

రసవత్తరంగా బ్యాడ్మింటన్‌ పోరు - Sakshi

 కడప స్పోర్ట్స్‌:
నగరంలోని వైఎస్‌ఆర్‌ ఇండోర్‌ స్టేడియంలో నిర్వహిస్తున్న ఆలిండియా సీనియర్‌ ర్యాంకింగ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌–2016 మెయిన్‌డ్రా మ్యాచ్‌లు హోరా హోరీగా సాగుతున్నాయి. గురువారం నిర్వహించిన తొలిరౌండ్‌ మ్యాచ్‌లలో పాల్గొన్న క్రీడాకారులు పదునైన స్మాష్‌లతో చక్కటి ఆటతీరుతో ఆకట్టుకున్నారు. తొలిరౌండ్‌లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులు రెండవ రౌండకు అర్హత సాధించారు. ఎస్‌ఎస్‌ఏ పీఓ వెంకటసుబ్బయ్య, సీపీఓ తిప్పేస్వామి, ప్రముఖ న్యూరాలజిస్టు కమ్మినేని ఆంజనేయులు, ఎస్‌బీఐ ఆర్‌ఓబీ రీజినల్‌మేనేజర్‌ శేషుబాబు తదితరులు మ్యాచ్‌లను ప్రారంభించారు.
తొలిరౌండ్‌ ఫలితాలు
మెన్స్‌ సింగిల్స్‌ :
నీరజ్‌ (రైల్వే), మున్వర్‌మహ్మద్‌ (కేరళ), భాస్కర్‌చక్రబర్తి (ఢిల్లీ), అజయ్‌కుమార్‌ (తెలంగాణ), అరుణ్‌కుమార్‌ (హర్యాణ), అభిషేక్‌ (కర్నాటక), అనీత్‌కుమార్‌ (ఏపీ), ఆస్కార్‌బన్సాల్‌ (చత్తీస్‌ఘడ్‌), రాహుల్‌యాదవ్‌ (తెలంగాణ), నిగేల్‌ డిసా (మహారాష్ట్ర), సృజన్‌నందలూరి (ఏపీ), కిరణ్‌కుమార్‌ (తెలంగాణ), ఆజాద్‌యాదవ్‌ (ఎంపీ), ఆరిన్‌తాప్‌ దాస్‌గుప్త (పశ్చిమబెంగాల్‌), రోహిత్‌యాదవ్‌ (ఎయిరిండియా), హిమాన్సుసరోహ (హర్యాణ), డేనియల్‌ఫరిద్‌ (కర్నాటక), సాహిల్‌బోర్దియా (రాజస్తాన్‌), హర్షిత్‌ అగర్వాల్‌ (కర్నాటక), అభిషేక్‌ సదానంద్‌ (మహారాష్ట్ర), శుభంప్రజాపతి (ఎంపీ), అరుణ్‌కుమార్‌ (తమిళనాడు), విజేత (తమిళనాడు), శ్రేయాన్ష్‌ జైశ్వాల్‌ (చత్తీస్‌ఘడ్‌).
ఉమన్స్‌ సింగిల్స్‌ : సాయిఉత్తేజితరావు (ఏపీ), ముగ్దార్గే (మహారాష్ట్ర), రేవతి దేవస్థలి (మహారాష్ట్ర), శ్రేయాన్షి పర్‌దేశీ (ఎంపీ), అనురా ప్రభుదేశాయ్‌ (ఎంపీ), రితూపర్ణదాస్‌ (తెలంగాణ), రియాపిల్లై (మహారాష్ట్ర), అనురియాదాస్‌ (పశ్చిమబెంగాల్‌), నేహా పండిట్‌ (మహారాష్ట్ర), శృతి ముండాడ (మహారాష్ట్ర), వైదేహి చౌదరి (మహారాష్ట్ర), శ్రీకృష్ణప్రియ (తెలంగాణ).
మిక్స్‌డ్‌ డబుల్స్‌ : అర్జున్‌–అపర్ణబాలన్‌ (కేరళ), కిరణ్‌కుమార్‌ (కర్నాటక)–ప్రంజల్‌ప్రభు (గోవా), చైతన్యరెడ్డి (రైల్వే)–సోనికాసాయి (ఏపీ), వేంబర్‌సన్‌ (తమిళనాడు)–పూర్ణిమ (తెలంగాణ), వైభవ్‌ (కర్నాటక)–సౌమ్యాసింగ్‌ (గుజరాత్‌), వినయ్‌కుమార్‌సింగ్‌–కరిష్మావడేకర్‌(యూపీ), కిర్తేష్‌దిండ్‌వాలా (హర్యాణ)–అనుభకౌషిక్‌ (ఢిల్లీ), కిరణ్‌కుమార్‌ (రైల్వే)–జమునరాణి (ఏపీ), వెంకట్‌గౌరవ్‌ప్రసాద్‌–జుహీదేవాంగన్‌ (చత్తీస్‌ఘడ్‌), విష్ణు–ఫర్హామతర్‌ (కేరళ), సుంజిత్‌–శృతి (కేరళ), సంజీత్‌–ధన్యానాయర్‌ (రైల్వే), బాలసుబ్రమణియన్‌–ఆగ్నాంటో (కేరళ).

 

Advertisement
Advertisement