ముగిసిన బంద్‌ | Sakshi
Sakshi News home page

ముగిసిన బంద్‌

Published Fri, Sep 16 2016 8:15 PM

ముగిసిన బంద్‌

హుజూర్‌నగర్‌ : నియోజకవర్గ కేంద్రమైన హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం అఖిలపక్ష పార్టీలు, విద్యార్థి, ఉద్యోగ జేఏసీల ఆధ్వర్యంలో చేపట్టిన పట్టణ బంద్‌ ప్రశాంతంగా ముగిసింది. ఈ సందర్భంగా స్థానిక వ్యాపార, వాణిజ్య కేంద్రాలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు స్వచ్ఛందంగా బంద్‌ పాటించాయి. అఖిలపక్ష నాయకులు పట్టణంలోని ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఇందిరాసెంటర్‌లో కోదాడ– మిర్యాలగూడ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీ, టీడీపీ, సీపీఎం, సీపీఐ, టీఆర్‌ఎస్, బీజేపీ, న్యూడెమోక్రసీ, పీడీఎస్‌యూ, ఐఎన్‌టీయూసీ, ఐఎఫ్‌టీయూ, ఉద్యోగ జేఏసీ నాయకులు యరగాని నాగన్నగౌడ్, తన్నీరు మల్లికార్జున్, గొట్టె రామయ్య, అరుణ్‌కుమార్‌ దేశ్‌ముఖ్, చావా కిరణ్మయి, వేముల శేఖర్‌రెడ్డి, శీలం శ్రీను, పాలకూరి బాబు, గూడెపు శ్రీనివాస్, మేకల నాగేశ్వరరావు, చిట్యాల అమర్‌నాథరెడ్డి, ఎంఏ.మజీద్, బాచిమంచి గిరిబాబు, జడ రామకృష్ణ, పిల్లి మల్లయ్య, గుండు వెంకటేశ్వర్లు, యల్లావుల రాములు, రౌతు వెంకటేశ్వరరావు, శీలం¯ éగరాజు, కుక్కడపు మహేష్, కలకుంట్ల రామయ్య, పీవీ.దుర్గాప్రసాద్‌ పాల్గొన్నారు. 
ముస్లిం మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలో...
పట్టణంలోని ముస్లిం మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక మున్సిఫ్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు సమీపంలోని అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలోఎస్‌కె.మన్సూర్‌అలీ, ఎస్‌కే. సైదా, షేక్‌ అక్బర్, ఎండి.మొయిన్, ఎండి. రహీం, రఫీ, హసన్‌మియా, జానీమియా, బడేమియా, బాజీ, సుభానీ, ఖాసిం పాల్గొన్నారు.
 
 
 

Advertisement
Advertisement