విశాఖలో బంద్‌ విజయవంతం | Sakshi
Sakshi News home page

విశాఖలో బంద్‌ విజయవంతం

Published Tue, Aug 2 2016 6:32 PM

విశాఖలో బంద్‌ విజయవంతం - Sakshi

సాక్షి, విశాఖపట్నం : ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ–టీడీపీ చేసిన ద్రోహాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌ సీపీ మంగళవారం తలపెట్టిన రాష్ట్ర బంద్‌ జిల్లాలో విజయవంతమైంది. అరెస్ట్‌లతో పోలీసులు ఉక్కు పాదం మోíపినప్పటికీ అన్ని వర్గాల నుంచి లభించిన అనూహ్య మద్దతు లభించింది.  వైఎస్సార్‌పీపీతో పాటు కాంగ్రెస్, వామపక్ష పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలతో పాటు కార్మిక, ప్రజా సంఘాల నేతలను సైతం ఎక్కడికక్కడ అరెస్ట్‌లు చేయగా.. పలుచోట్ల వాగ్వాదాలు..తోపులాటలు సైతం జరిగాయి. సిటీలో పోలీసులు బలవంతంగా బస్సులను తిప్పినప్పటికీ గ్రామీణ, ఏజెన్సీప్రాంతాల్లో మధ్యాహ్నం 12 గంటల వరకు బస్సులు పూర్తిగా డిపోలకే పరిమితమయ్యాయి. విశాఖ సిటీతో జిల్లా వ్యాప్తంగా షాపింగ్‌ మాల్స్, జ్యూయలరీ దుకాణాలు, వర్తక, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. మల్టీఫ్లెక్స్‌లతో సహా జిల్లా వ్యాప్తంగా థియేటర్లలో నూన్‌షోను నిలిపివేశారు. ఏయూలో తరగతులు నిర్వహిస్తుండగా వైఎస్సార్‌సీపీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి బిఎల్‌ కాంతారావు ఆధ్వర్యంలో విద్యార్థి నాయుకులు వార్ని బయటకు పంపించేశారు. ఏయూ మెయిన్‌ క్యాంపస్‌ కార్యాలయం వద్ద రోడ్డుపై బైటాయించి నిరసన తెలపుగా అరెస్ట్‌ చేశారు. ఏయూలో బంద్‌ వాతావరణం కన్పించింది. విశాఖ మద్దిలపాలెం జంక్షన్‌లో బస్‌డిపో ఎదుట జాతీయరహదారిపై బైటాయించి రాస్తారోకో చేస్తున్న వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నా«ద్‌తో సహా ఆ పార్టీ తూర్పు, ఉత్తర కో ఆర్డినేటర్లు వంశీకష్ణ శ్రీనివాస్, తైనాల విజయ్‌కుమార్, రాష్ట్ర కార్యదర్శి కంపా çహనోక్, రాష్ట్రఅధికార ప్రతినిధి కొయ్యా ప్రసాదరెడ్డి, ఇతర ముఖ్య నేతలను అరెస్ట్‌ చేశారు. ఇదే జంక్షన్‌లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్‌ నరసింగారావు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తిలను అదుపులోకి తీసుకున్నారు. అలాగే జగదాంబ సెంటర్‌లో పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ద్రోణంరాజు శ్రీనివాస్, నగరాధ్యక్షుడు బెహరా భాస్కర్‌లతో పాటు వైఎస్సార్‌సీపీ, వామపక్ష నేతలను అరెస్ట్‌చేశారు. ఇక్కడ చంద్ర బాబు దిష్టిబొమ్మను వైఎస్సార్‌ సీపీ శ్రేణులు దగ్దం చేశారు. విశాఖ దక్షిణ కో ఆర్డినేటర్‌ కోలా గురువులు, రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు  దొండపర్తి జంక్షన్‌లో మానవహారంగా ఏర్పడి నిరసన తెలపగా పోలీసులు చుట్టుముట్టి అరెస్ట్‌ చేశారు. గాజువాకలో పార్టీకో ఆర్డినేటర్‌ తిప్పల నాగిరెడ్డిని, పెందుర్తి నాల్గురోడ్ల జంక్షన్‌లో మానవ హారం చేస్తున్న పార్టీ కో ఆర్డినేటర్‌ అన్నంపురెడ్డి అదీప్‌రాజు, తగరపువలసలో ర్యాలీ చేస్తున్న భీమిలి కో ఆర్డినేటర్‌ మాజీ ఎమ్మెల్యే కర్రిసీతారాంలను అరెస్ట్‌ చేశారు. గాజువాక కో ఆర్డినేటర్‌ తిప్పల నాగిరెడ్డి పార్టీ శ్రేణులతోకలిసి పాతగాజువాక జంక్షన్‌లో  బలవంతంగా అరెస్ట్‌ చేశారు. స్టీల్‌ప్లాంట్‌ డిపో వద్ద బస్సులను అడ్డుకునేందుకు యత్నించిన పార్టీ సీఈసీ సభ్యుడుదామా సుబ్బారావుతో సహా పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనకాపల్లి పట్టణంలో ర్యాలీగా వెళ్లి షాపులు మూయించేందుకు యత్నిస్తున్న వైఎస్సార్‌ సీపీ  పట్టణపార్టీ అధ్యక్షుడు మందపాటి జానకి రామరాజుతో సహా పలువుర్ని అదుపులోకి తీసుకున్నారు. తుమ్మపాల సుగర్‌ ఫ్యాక్టరీ వద్ద  బంద్‌లో భాగంగా పార్టీ నేతలు నిరసన తెలిపారు. 
      పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, అరుకులో త్రిసభ్య కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో ఏజెన్సీలో బంద్‌ సూపర్‌ సక్సెస్‌ అయ్యింది. ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు ఆధ్వర్యంలో మాడుగులలో బంద్‌ విజయవంతమైంది. నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద ఆందోళన చేస్తున్న కో ఆర్డినేటర్‌ పెట్ల ఉమాశంకర గణేష్‌ను అరెస్ట్‌ చేయడంతో కోపద్రక్తులైన కార్యకర్తలు బస్సుల అద్దాలు పగులకొట్టి..టైర్లకు గాలితీసేశారు.ఎస్‌.రాయవరం వద్ద జాతీయ రహదారిపై బైటాయించేందుకు యత్నిస్తున్న పాయకరావుపేట కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే గొల్లబాబూరావు, నక్కపల్లి వద్ద జాతీయ రహదారిపై ఆందోళనకు దిగిన మరో కో ఆర్డినేటర్‌ వీసం రామకష్ణలను అరెస్ట్‌ చేశారు. కోటవురట్లలో మాజీ ఎమ్మెల్సీ డివి ఎస్‌ఎన్‌ రాజు ఆధ్వర్యంలో బంద్‌ జరిగింది. యలమంచిలో బంద్‌ను పర్యవేక్షిస్తున్న కో ఆర్డినేటర్‌ ప్రగడ నాగేశ్వరరావు, అదనపు కో ఆర్డినేటర్‌ బొడ్డేడ ప్రసాద్‌లను అరెస్ట్‌ చేశారు.
నర్సీపట్నంలో పార్టీ పార్టీ కో ఆర్డినేటర్‌ పెట్ల ఉమాశంకర గణేష్‌ పార్టీ శ్రేణులతో కలిసి తెల్లవారుజామున 3 గంటలకే ఆర్టీసీ డిపో ఎదుట బైటాయించి బస్సులను అడ్డుకున్నారు. 10 గంటల సమయంలో ఉమాశంకర్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా  అరెస్టు చేసుకుంటే చేసుకోండి అంటూ పోలీసు వాహనం ముందు  పడుకుని నిరసన వ్యక్తం ఏచశారు. ఉమాశంకర్‌తో వైఎస్సార్‌సీపీ, వామపక్షాల నేతలను అరెస్ట్‌ చేయగా రెచ్చిపోయిన కార్యకర్తలు బయటకొస్తున్న బస్సుల అద్దాలు, టైర్లుకు గాలితీశారు.దీంతో మధ్యాహ్నం ఒంటి గంట వరకు బస్సులను డిపోలో నిలిపివేశారు. చోడవరం పార్టీ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, మాజీ ఎమ్మెల్యే మిలట్రీ నాయుడు ఆధ్వర్యంలో చోడవరంలో బంద్‌ చేయించారు. కొత్తూరు జంక్షన్‌లో చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్దం చేశారు. కొత్తూరు జంక్షన్‌లో సీపీఎం, సీపీఐ కార్యకర్తలు మానవహారం చేశారు. గోవాడ షుగర్స్‌ కార్మికులు సామూహిక సెలవులు పెట్టి బంద్‌లోపాల్గొన్నారు. జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి ఏరువాక సత్యారావు ఆధ్వర్యంలో ఫ్యాక్టరీ కార్మికులు ఫ్యాక్టరీ ఎదుటే రాస్తారోకో చేశారు. అరుకులోయ  నియోజకవర్గంలో కూడా బంద్‌ విజయవంతమైంది. ఇక్కడ  త్రిసభ్య కమిటి సభ్యురాలు కె. అరుణకుమారి,పోయా రాజారావు, జర్సింగి సూర్యనారాయణ, పార్టీ జిల్లా అధికార ప్రతినిధులు శెట్టి అప్పాలు, సమర్థి రఘునా«ద్‌ బంద్‌ను పర్యవేక్షించారు. అరుకులోయలో పర్యాటక ప్రాంతాలైన∙గిరిజన మ్యూజియం, బొర్రాగుహలుమూతపడ్డాయి. 
 
 
 
 
 
 
 
 

Advertisement
Advertisement